ETV Bharat / state

దూసుకొస్తున్న వాయుగుండం - రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం - సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Updated : 3 hours ago

NDRF Entered the Field for Relief Operations in AP
NDRF Deployed for Relief Operations in Andhra Pradesh (ETV Bharat)

NDRF Deployed for Relief Operations in Andhra Pradesh : నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​లోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైకి 280 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 320 కిలోమీటర్లు.. నెల్లూరుకు 370 కిలోమీటర్ల మేర దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా 15 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది.

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో ఆకస్మిక వరద వచ్చే ఛాన్స్​ ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఇప్పటికే సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అవసరమైన చోట పునరావాస సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

సీమ జిల్లాల్లో జోరు వానలు : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కడప, అన్నమయ్య, ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జోరువానలతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. తిరుమలలో రెండో రోజూ ఎడతెరిపిలేని వర్షంతో భక్తులకు ఇక్కట్లు తప్పలేదు.

వాయుగుండం ప్రభావంతో వైఎస్ఆర్​ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కడప నగరం జలదిగ్భంధమైంది. ఎడతెరిపిలేని వర్షాలకు రహదారులన్నీ వర్షపు నీటితో నిండి పోయాయి. కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు, కోర్టు ఎదురుగా, ఆర్.ఎం. కార్యాలయం వద్ద రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. రోడ్లపై నీటిని అధికారులు యంత్రాల ద్వారా బయటికి తరలించే ప్రయత్నం చేశారు. పలు కాలనీల్లోకి, లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణమంతా మోకాళ్లలోతు నీటితో నిండిపోయింది.

నాలుగేట్ల ద్వారా పెన్నా నదికి నీరు విడుదల : ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. వరి, అరటి, శనగ పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ఒంటిమిట్ట, పోరుమామిళ్ల, వేంపల్లె, కడప మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. పోరుమామిళ్లలో 90 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జమ్మలముడుగు నియోజకవర్గంలోనూ జోరువానలు కురిశాయి. గండికోట జలాయశం నుంచి మైలవరానికి, అక్కడి నుంచి నాలుగేట్ల ద్వారా పెన్నా నదికి నీటిని విడుదల చేశారు. క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు ఆదేశించారు.

ప్రకాశం జిల్లాకు ఆకస్మిక వరదల ముప్పు - స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

అల్పపీడన ద్రోణితో అల్లకల్లోలంగా మారిన కోస్తా జిల్లాలు - ఆ జిల్లాల్లో రెడ్ అలెర్ట్

Last Updated : 3 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.