Five Arrested in Drugs Case in Hyderabad : బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న భార్యాభర్తలు సయ్యద్ ఫైజల్, ముషారత్ ఉన్నీసా బేగం అలియాస్ నదియాతో పాటు మరో ముగ్గురిని తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4లక్షలు విలువ చేసే 4గ్రాముల ఎండీఎంఏ, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంబర్‌పేట్‌కు చెందిన సయ్యద్ ఫైజల్ కుక్కపిల్లలను విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఐదేళ్ల క్రితం ముషీరాబాద్‌లో ఉంటున్న ముషారత్ ఉన్నీసా బేగంతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. కుక్కల విక్రయాలు చేసే వీరు డ్రగ్స్ దందాకు తెర లేపారు. వీరి దందాలో మహ్మద్ అబ్రార్ ఉద్దిన్, రహ్మత్ ఖాన్‌లను చేర్చుకున్నారు. బెంగళూరులో ఉండే జునైద్ ఖాన్‌తో పరిచయం ఏర్పరుచుకున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా పట్టుబడిన గంజాయి - ఐదుగురు అరెస్టు
Hyderabad Drugs Case : హైదరాబాద్‌లో మత్తుపదార్థాలు విక్రయించేందుకు గోవా వెళ్లి కొనుగోలు చేసేవారు. బెంగళూరులోని జునైద్ ఖాన్ ద్వారా కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ వంటివి తీసుకొచ్చేవారు. అక్కడ ఒక్క గ్రాము ఎండీఎంఏ డ్రగ్ రూ.5-6వేలకు కొని నగరంలో రూ.8-10 వేలకు విక్రయించేవారు. మిగతా పదార్థాలను అక్కడ తక్కువ ధరకు కొని హైదరాబాద్‌లో ఎక్కువ రేటు అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
పలు మార్ల అరెస్టయినా మారని వైఖరి : గతంలో ఇదే కేసులో పలుమార్లు అరెస్టయి జెలుకెళ్లొచ్చినా తిరిగి డ్రగ్స్ దందా మార్గం ఎంచుకున్నారు. దీనిపై పలుమార్లు పోలీసులు హెచ్చిరించినా అప్పటివరకు మారినట్లు నటించి మళ్లీ డ్రగ్స్ విక్రయాలు చేపట్టేవారు. వారం రోజుల క్రితం దంపతులు, మహ్మద్ అబ్రార్ ఉద్దీన్, రహ్మత్ ఖాన్ కలిసి బెంగళూరు వెళ్లారు. అక్కడ జునైద్ ఖాన్ వద్ద 34 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను కొన్నారు. వీరిపై నిఘా ఉంచిన టీజీన్యాబ్ పోలీసులు ఈ నెల 10న బెంగళూర్ నుంచి మత్తుపదార్థాలతో నగరానికి చేరుకున్న వీరిని హసన్‌నగర్ క్రాస్‌రోడ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ విక్రయిస్తూ ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్టు - drugs case in hyderabad