ETV Bharat / state

కట్టడి చేయాల్సిన వారే కట్టుదాటారు - గంజాయి స్మగ్లర్లతో పోలీసుల దోస్తీ, చివరికి ఎలా చిక్కారంటే? - POLICE DEAL WITH GANJA SMUGGLERS

గంజాయి స్మగ్లర్లతో కలిసి దందా నడిపిన పోలీసులు - ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు

Police Colluded With Ganja Smugglers
Police Colluded With Ganja Smugglers (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2024, 8:00 PM IST

Police Colluded With Ganja Smugglers : పోలీస్‌ డిపార్ట్​మెంట్​లో అక్రమార్కుల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో విఫలమైనందుకు మల్టీజోన్‌-2లో ఇటీవలే ముగ్గురు ఇన్‌స్పెక్టర్లతో పాటు 13 మంది ఎస్సైలపై వేటు పడగా తాజాగా మరో నలుగురి అక్రమ దందా బహిర్గతమైంది. ఈసారి ఏకంగా గంజాయి స్మగ్లర్లతో దోస్తీ అయిన నలుగురు పోలీసుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మల్టీజోన్‌-2లోని ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్‌కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్‌ల హస్తం ఉన్నట్లు అంతర్గత విచారణలో తేలింది. దొరికిన గంజాయిని రెండు సార్లు వదిలేసి స్మగ్లర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నట్లు వెల్లడి కావడంతో వారిపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ మల్టీజోన్‌-2 ఐజీ వి.సత్యనారాయణ శుక్రవారం ఆర్డర్స్ జారీ చేశారు.

ఇంతకీ ఆ దందా వెనుక ఉన్న కథేంటంటే : పటాన్‌చెరు పోలీస్​ స్టేషన్​లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న అంబారియా, ప్రస్తుతం వేకెన్సీ రిజర్వులో ఉన్న ఎస్సై వినయ్‌కుమార్‌తో పాటు సంగారెడ్డి సీసీఎస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మారుతి నాయక్, మనూర్‌ ఠాణా ఏఆర్‌ కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) మధుపై సస్పెన్షన్‌ వేటు వేశారు. వినయ్‌ గతంలో సంగారెడ్డి రూరల్‌ ఠాణాలో పనిచేస్తున్నప్పుడు ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో విఫలం కావడంతో వీఆర్‌కు పంపారు. గతంలోనే అతడికి గంజాయి స్మగ్లర్లతో కొంతమేర సంబంధాలుండేవి. ఆ టైంలోనే మారుతినాయక్, మధులతో పరిచయాలు ఉన్నాయి. అంబారియా సహా నలుగురు జట్టు కట్టి మత్తు దందాకు తెరలేపారు.

స్మగ్లర్‌ సెల్‌ఫోన్‌లో మధు నంబర్‌

సంగారెడ్డి జిల్లా చిరాగ్‌పల్లి, బీడీఎల్‌ భానూర్‌ పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి రవాణా చేస్తూ మల్లుగొండ, మల్లేశ్‌నాయక్, లకాన్‌లు పోలీసులకు చిక్కారు. గతంలోనూ వారిపై మత్తుపదార్థాల రవాణా కేసులుండటంతో ఎస్పీ చెన్నూరి రూపేశ్‌ ఆధ్వర్యంలో లోతుగా విచారించారు. నిందితుల్లో ఒకరి మొబైల్​ను పరిశీలించగా కానిస్టేబుల్‌ మధు ఫోన్‌ నంబర్‌ కనిపించింది. నిందితుడిని ప్రశ్నించగా గంజాయి రవాణా ఇన్ఫార్మర్‌గా తనను వినియోగించుకున్నట్లు వివరించాడు. పదేపదే కానిస్టేబుల్‌తో మాట్లాడినట్లు ఫోన్‌లో స్పష్టమవుతున్నా ఆ టైంలో గంజాయి ట్రాన్స్​పోర్ట్​ కేసులు నమోదు కాకపోవడంతో విచారణాధికారులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో అతడిని ప్రశ్నించడంతో పోలీసుల కుమ్మక్కు వ్యవహారం బయటపెడింది. మే 31న అంబారియా మనూర్‌ ఠాణా ఎస్సైగా పనిచేసిన సమయంలో గంజాయి రవాణా గురించి ఇన్ఫర్మేషన్ రావడంతో ఆయన, వినయ్‌కుమార్, మారుతి నాయక్, మధు మాటు వేశారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలంలోని సయిత్పూర్‌ సమీపంలో గంజాయి స్మగ్లర్ల వెహికల్​ను పట్టుకున్నారు. దానిలో 120 కేజీల గంజాయి లభ్యమైంది. ఈ క్రమంలోనే వారి నుంచి సొమ్ము దండుకొని సరకు సహా స్మగ్లర్లను వదిలేశారు. ఏడు నెలల క్రితం కూడా ఇదే మాదిరిగా జరిగింది. నిజామాబాద్‌ జిల్లా వర్నిలో స్మగ్లర్ల వాహనాన్ని ఇదే పోలీస్ టీం పట్టుకుంది. అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ చోటుకు తీసుకెళ్లింది. గంజాయిని, వెహికల్​ను, నిందితులను వదిలేసింది. ఎస్పీ అంతర్గత విచారణలో ఈ వ్యవహారాలు తేలడంతో ఐజీకి రిపోర్ట్ పంపించారు. దీని ఆధారంగా ఐజీ సత్యనారాయణ సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

" రాష్ట్ర పోలీస్‌శాఖ, తెలంగాణ నార్కొటిక్‌ కంట్రోల్‌బ్యూరో ప్రతిష్ఠాత్మకంగా గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతూ సత్ఫలితాలు మెరుగ్గా సాధిస్తున్నాయి. ఈ తరుణంలో కొందరు పోలీసులు ఇలాంటి అక్రమాలకు పాల్పడటంతో పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగం కలుగుతోంది. అందుకే అలాంటి అధికార దుర్వినియోగపరులపై కఠినచర్యలు తీసుకుంటున్నాం. ఈ నలుగురిపై ఎన్డీపీఎస్‌ యాక్ట్ కింద కేసు నమోదుకు ఉన్న అవకాశాలపై న్యాయ సలహాలు తీసుకుంటున్నాం." -వి.సత్యనారాయణ, మల్టీజోన్‌-2 ఐజీ

జూదం సొమ్ము సెటిల్​మెంట్​లో పేచీ - అడ్డంగా బుక్కైన పోలీసులు

'అసలు పాలకుర్తి పోలీస్​ స్టేషన్​లో ఏం జరుగుతోంది?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.