ETV Bharat / state

రూ.4.25 లక్షల కోట్ల 'పెళ్లిళ్ల సీజన్‌'! - ఒక్కటి కానున్న 35 లక్షల జంటలు - WEDDING BUSINESS IN INDIA 2024

Wedding Business in November 2024 : పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. కానీ ఆ పెళ్లి చేయడం ఎంత కష్టమో పెద్దలు ఏనాడో చెప్పారు. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఊరికనే అనలేదు. ఇల్లు కట్టినప్పుడు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో, పెళ్లి చేసినప్పుడు కూడా అంత డబ్బు ఖర్చు అవుతుంది. పెళ్లిళ్లు చేసినప్పుడు కూడా తాహతుకు మించి చాలా మంది ఖర్చు చేస్తారు. ఈ అవకాశాన్నే వ్యాపార సంస్థలు ఆసరాగా తీసుకొని రూ.కోట్లను గడిస్తున్నాయి. మరి ఈ సీజన్​లో ఎన్ని పెళ్లిళ్లు జరగనున్నాయి? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయో తెలుసా?

Wedding Business in November 2024
Wedding Business in November 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2024, 4:07 PM IST

Updated : Sep 23, 2024, 4:38 PM IST

Wedding Season Business In November 2024 : మరో రెండు నెలల్లో పెళ్లిళ్ల సీజన్​ రాబోతోంది. నవంబరు, డిసెంబరు మాసాల్లో సుమారు 35 లక్షల పెళ్లిళ్లకు బాజాభజంత్రీలు మోగబోతున్నాయి. ముఖ్యంగా భారతీయ సమాజంలో పెళ్లికి ఉన్నంత ప్రాధాన్యం, ప్రత్యేకత మరే సందర్భానికి లేదంటే అతిశయోక్తి లేదు. పేదవాడి నుంచి కుబేరుడి వరకు తమ పిల్లల పెళ్లిని గ్రాండ్‌గా జరపాలనుకుంటారు. కొన్ని సందర్భాల్లో తాహతుకు మించి ఖర్చు చేస్తారు.

ఖరీదైన బట్టలు, ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు, అలంకరణ సామగ్రి అంటూ నానా హడావుడి చేస్తారు. అలాగే కార్లు, మండపాలు, కన్వెన్షన్​ సెంటర్లు, హోటల్ బుకింగ్స్​ వరకు చాలానే ఖర్చు చేయాలి. అందుకే పెద్దలు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అన్నారు. ఇప్పుడు ఈ పెళ్లిళ్ల సీజన్​ను వ్యాపార సంస్థలు అతిపెద్ద బిజినెస్​గా ఎంచుకున్నారు. ఈ రెండు నెలల సీజన్​లోనే ఏకంగా రూ.4 లక్షల కోట్ల పైబడి లావాదేవీలు జరగనున్నాయి.

కార్పొరేట్‌ సంస్థల ఫోకస్​ : ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లలో వస్తున్న భారీ లాభాలను చూసి కార్పొరేట్​ సంస్థలు కూడా ప్రవేశిస్తున్నాయి. ఇంతకాలం వ్యక్తులు, చిన్న సంస్థలు మాత్రమే పెళ్లిళ్లకు సంబంధించిన సేవలను అందించేవి. కానీ ఇప్పుడు కార్పొరేట్​ రంగం ప్రవేశంతో ఇది సంఘటిత రంగంగా మారిపోతోంది. పెళ్లిళ్లకు సంబంధించిన వస్తువులు, ఉపకరణాలు అందించే ప్రైవేట్​ సంస్థలు ఎప్పటి నుంచే వాటి కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ సంస్థలు ఏటా నమోదు చేసే వ్యాపారంలో సగానికి పైగా టర్నోవర్​ పెళ్లిళ్ల సీజన్​ నుంచే వస్తోంది.

ఈ దసరా పండుగ తర్వాత 15 రోజుల తర్వాత నుంచి మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్ల సీజన్​ వచ్చేస్తోంది. ముఖ్యంగా నవంబరు, డిసెంబరు నెలల్లో అధికంగా ముహూర్తాలు ఉన్నాయి. దేశం మొత్తం మీద సుమారు 35 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. వీటిపై రూ.4.25 లక్షల కోట్ల వ్యయం చేయనున్నారని ఆర్థిక సేవల సంస్థ అయిన ప్రభుదాస్​ లీలాధర్​ తాజా నివేదికలో అంచనా కట్టారు.

భారత్​లోనే డెస్టినేషన్​ వెడ్డింగ్​ సెంటర్లు : ధనవంతులు, సెలబ్రిటీలు తమ వివాహాలను విదేశాల్లో జరుపుకోవడం చూస్తున్నాం. వీటినే వారు డెస్టినేషన్​ వెడ్డింగ్​గా పేర్కొంటారు. ఈ డెస్టినేషన్​ వెడ్డింగ్​కు సంపన్న కుటుంబాల నుంచి ఆదరణ భారీగానే ఉంది. మన దేశంలోని సెలబ్రెటీలు, సంపన్నులు దేశంలో ఉన్న పర్యాటక కేంద్రాలను వదిలేసి లండన్​, సింగపూర్​, దుబాయ్​ తదితర దేశాల్లో వెడ్డింగ్​లు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కారణం అక్కడ పర్యాటకంగా, బ్యాక్​గ్రౌండ్​ సీనరీలు వంటివి మంచిగా వస్తాయి.

భారత్​లోనూ అలాంటి డెస్టినేషన్​ ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతాలను డెస్టినేషన్​ వెడ్డింగ్​కు ప్రధాన కేంద్రాలుగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. అందుకు తొలి అడుగుగా పర్యాటక విధానాన్ని రూపొందిస్తోంది. నిధుల విషయంలో కూడా ముందుగానే మేల్కొని అవసరమైన నిధులను కేటాయిస్తోంది. ఈ విధానం ద్వారా విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవాలనే జంటలను, వారి బంధుమిత్రులను ఆకర్షించాలని చూస్తోంది.

ఏడాదికి రూ.1 లక్ష కోట్లు ఖర్చు : ఇలాంటి డెస్టినేషన్​ వెడ్డింగ్​ కేంద్రాలను భారత్​లో 25ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి సంపన్న కుటుంబాలు ఖర్చు చేసే మొత్తం ఏంతో తెలుసా అక్షరాలా రూ.1 లక్ష కోట్ల కంటే అధికం. ఈ మేరకు విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్​ కోల్పోవాల్సి వస్తోంది. దీన్ని సగానికైనా తగ్గించాలని అందుకు భారత్​లో ఇలాంటి వెడ్డింగ్​ డెస్టినేషన్​లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

గణపతికి ఈ నైవేద్యం పెడితే మీకు ఉద్యోగం పక్కా! - ఈ పూలతో పూజిస్తే పెళ్లి బాజా మోగుతుంది! - Vinayaka Chavithi 2024

శుభ గడియలు వచ్చేశాయ్​ - పెళ్లికి బాజా మోగింది - కుమారి శ్రీమతి కానుంది - Wedding Season Started

Last Updated : Sep 23, 2024, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.