ETV Bharat / state

కుక్కలు బాబోయ్ కుక్కలు - 10 ఏళ్లలో 3 లక్షల మందిని కరిచాయ్‌! - DOG BITE CASES IN HYDERABAD

Stray Dogs Have Bitten 3 Lakh People : జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల బెడద రోజురోజుకు ఎక్కువవుతోంది. కుక్కల పెరుగుదలకు తగ్గట్లుగా నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో వాటి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వీధి కుక్కల నియంత్రణకు బల్దియా పశు వైద్య విభాగం ఏటా రూ.10 కోట్లు ఖర్చు చేస్తుంది. అయినప్పటికీ కుక్కల దాడి, నియంత్రణ మాత్రం తగ్గడం లేదు. రోజు ఎక్కడో ఒక్క చోట కుక్కల దాడి ఘటనలు వినిపిస్తునే ఉన్నాయి.

Stray Dogs
Stray Dogs (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 8:18 AM IST

Stray Dogs Have Bitten 3 Lakh People In GHMC : హైదరాబాద్ నగరంలో కుక్కల సంఖ్యతోపాటుగా కుక్కకాటు ఘటనలూ రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన పదేళ్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 3,36,767 మందిని కుక్క కరిచిన కేసులు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)లో నమోదయ్యాయి. అందులోని కొన్నికేసులు పిల్లులు, కోతులు కరిచినవి కూడా ఉన్నట్లు, జీహెచ్‌ఎంసీ తెలిపింది. జీహెచ్‌ఎంసీ వెల్లడించిన లెక్కలు పరిశీలిస్తే, గడిచిన పదేళ్లలో వీధికుక్కల సంఖ్య దాదాపు స్థిరంగా ఉన్నా, అవి దాడి చేసే ఘటనలు పెరుగుతున్నాయి. వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్‌ఎంసీ తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నగరంలో సుమారు 6 లక్షల శునకాలున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంటుంది. ఏడేళ్ల క్రితం 5.8 లక్షలున్నట్లు అధికారులు వెల్లడించారు. అంటే వాటి సంఖ్య పెరగడమేగానీ, తగ్గటంలేదు. మరోవైపు వీధి కుక్కల నియంత్రణకు బల్దియా పశు వైద్య విభాగం ఏటా రూ.10 కోట్లు ఖర్చు చేస్తుంది. గడిచిన రెండేళ్లుగా రూ.11.5 కోట్ల వార్షిక వ్యయాన్ని అధికారులు లెక్కల్లో చూపించారు.

మొత్తం ఐదు జంతు సంరక్షణ కేంద్రాల్లో రోజూ సుమారు 400 శునకాలకు పిల్లలు పుట్టకుండా ఏబీసీ శస్త్రచికిత్సలు చేస్తున్నామని తెలిపారు. తద్వారా సంతతిని కట్టడి చేస్తున్నామని అంటున్నారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితులు అధికారులు చెబుతున్న దానికి విరుద్ధంగా ఉంది. ఏ వీధిలో చూసినా ఐదు నుంచి పది శునకాలు దర్శనమిస్తున్నాయి. బడికెళ్లే పిల్లలు, పాదచారులు, వృద్ధులు, మహిళలను కరుస్తున్నాయి. కొత్త వ్యక్తులు కనిపిస్తే వారి వెంట పడుతున్నాయి. గడిచిన పదేళ్లలో జీహెచ్‌ఎంసీకి 3,60,469 ఫిర్యాదులు వచ్చాయి.

కుక్కను తీసుకువచ్చి పిల్లికి వైద్యం చేయాలన్న మందుబాబు - అంతా నవ్వులే - వీడియో వైరల్​ - Mandu Babu Funny Video viral in ap

రేబిస్‌ వైరస్‌ సోకి 8 మంది మృతి : రేబిస్‌ వైరస్‌ సోకిన శునకాలు పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తాయి. క్రమంగా కుక్కల ఆరోగ్యం విషమించి చనిపోతాయి. ఆ క్రమంలో ఎదురుపడిన వారిపై దాడి చేసి కరవడం చేస్తాయి. ఈ పదేళ్ల కాలంలో వీధికుక్కల దాడికి గురై 8 మంది చనిపోయినట్లు ఐపీఎం లెక్కలు చెబుతున్నాయి. ఐపీఎంలో వైద్యం చేయించుకుని చనిపోయిన వారి సంఖ్య 8 మాత్రమే. కానీ, బయటి ఆస్పత్రుల్లోని లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే మరింత ఎక్కువ మంది ఉండొచ్చని స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి.

ఏమార్చే చర్యలతోనే మామూలుగా అయితే, కుక్కలు సంవత్సరానికి రెండుసార్లు గర్భం దాల్చుతాయి. ఆ రెండు సీజన్లు పూర్తయ్యేలోపు అన్నింటికీ ఏబీసీ శస్త్రచికిత్సలు జరగాల్సి ఉంది. జీహెచ్ఎంసీ వద్ద అంతటి సామర్థ్యం లేదు. వీధి కుక్కలను పట్టుకునేందుకు 50 వాహనాలు, 362 మంది సిబ్బందితో పాటుగా కేవలం 22 మంది వైద్యులు మాత్రమే ఉన్నారు. వారంతా నగరంలోని ఐదు జంతు సంరక్షణ కేంద్రాల పరిధిలో పని చేస్తున్నారు. ప్రస్తుతమున్న యంత్రాంగంతో ముమ్మర ఏబీసీ ఆపరేషన్లు కుదరవని చెబుతున్నారు. గోవా, బెంగళూరు, తదితర నగరాల్లో మాదిరి గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఆధునిక విధానాలను ఉపయోగించి, రెండు సీజన్లలో అన్నింటికీ శస్త్రచికిత్సలను పూర్తి చేయాలని ఎన్జీవోలు సూచనలు చేస్తున్నాయి.

కేటీఆర్ సార్... మేయర్‌ను కుక్కల మధ్యలో పడేయండి: ఆర్జీవీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.