ETV Bharat / sports

జింబాబ్వే వరల్డ్ రికార్డ్- T20 హిస్టరీలోనే అత్యధిక స్కోర్

జింబాబ్వే ప్రపంచ రికార్డు- టీ20ల్లోనే అత్యధిక స్కోర్ నమోదు

T20 Highest Score
T20 Highest Score (Source: AFP)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 23, 2024, 7:10 PM IST

Updated : Oct 23, 2024, 8:38 PM IST

T20 Highest Score : అంతర్జాతీయ టీ20ల్లో జింబాబ్వే క్రికెట్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20 వరల్డ్​కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో జింబాబ్వే 344- 4 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ టోర్నీలో బుధవారం గాంబియాపై జరిగిన మ్యాచ్​లో జింబాబ్వే ఈ ఘనత సాధించింది. దీంతో టీ20 హిస్టరీలోనే అత్యధిక పరుగులు నమోదు చేసిన జట్టుగా జింబాబ్వే ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలోనే నేపాల్ (314 పరుగులు vs మంగోలియా, 2023 ఆసియా క్రీడలు) రికార్డును బ్రేక్ చేసింది.

జింబాబ్వే బ్యాటర్లలో సికిందర్ రజా 43 బంతుల్లోనే 133 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇందులో ఏకంగా 15 సిక్స్​లు ఉన్నాయి. ఓపెనర్లు బ్రియాన్ బినెట్ (50 పరుగులు, 26 బంతుల్లో 7x4; 1x6), తడివానాశే మారుమణి (62 పరుగులు , 19 బంతుల్లో 9x4; 4x6), క్లైవ్ మండాడే (53* పరుగులు , 17 బంతుల్లో 3x4; 5x6) రఫ్ఫాడించారు. గాంబియా బౌలర్లలో ముస జొబారెత్ తన నాలుగు ఓవర్ల స్పెల్​లో వికెట్ లేకుండా 93 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక అండ్రీ 2, అర్జున్​సింగ్, బుబాకర్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్లు

  • జింబాబ్వే - 344/4 vs గాంబియా, 2024
  • నేపాల్- 314/3 vs మంగోలియా, 2023
  • భారత్- 297/6 vs బంగ్లాదేశ్‌, 2024
  • జింబాబ్వే- 286/5 vs సీషెల్స్‌పై 2024
  • అఫ్గానిస్థాన్- 278/3 vs ఐర్లాండ్‌పై, 2019
  • చెక్‌ రిపబ్లిక్- 278/4 vs తుర్కియేపై, 2019

భారీ లక్ష్య ఛేదనలో దిగిన గాంబియా 14.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలింది. గాంబియా బ్యాటర్లలో తొలి 10 మంది బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పెవిలియన్ చేరడం విశేషం. 10వ స్థానంలో క్రీజులోకి వచ్చిన ఆండ్రీ (12) టాప్ స్కోరర్​. దీంతో జింబాబ్వే 290 పరుగుల తేడాతో నెగ్గింది. టీ20ల్లో పరుగుల పరంగానూ ఇదే భారీ విజయం. ఇంతకుముందు ఈ రికార్డు నేపాల్ (290 పరుగులు vs మంగోలియాపై 2023) పేరిట ఉండేది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 3, బ్రాండన్ మావుట 3, వెస్లీ మధ్వీర 2, ర్యాన్‌ బర్ల్ ఒక వికెట్ పడగొట్టారు.

10 పరుగులకే ఆలౌట్- T20 హిస్టరీలో అత్యల్ప స్కోర్ - T20 Lowest Score

12 పరుగులకే ఆలౌట్- T20 హిస్టరీలో రెండో అత్యల్ప స్కోర్ - Lowest Total In T20 History

Last Updated : Oct 23, 2024, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.