Yashasvi Jaiswal England 3rd Test: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ (214*) తో అదరగొట్టాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విజృంభించాడు. 104 పరుగులతో శనివారం రిటైర్డ్ హర్ట్‌గా క్రీజును వీడిన జైశ్వాల్, నాలుగో రోజు ఆటలో బరిలోకి దిగి అదరగొట్టాడు. ప్రస్తుత సిరీస్‌లోనే జైశ్వాల్‌కు ఇది రెండో డబుల్ సెంచరీ. ఇక భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 430/4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. దీంతో టీమ్ఇండియా 555 పరుగుల ఆధిక్యంలో నిలిచి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఈ ఇన్నింగ్స్‌తో జైశ్వాల్ సాధించిన పలు రికార్డులు
- ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు నమోదు చేసిన టీమ్ఇండియా బ్యాటర్‌గా జైశ్వాల్ రికార్డు సాధించాడు. ఈ సిరీస్‌లో జైశ్వాల్ ఇప్పటివరకు 545 పరుగులు బాదాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా మాజీ ప్లేయర్ సౌరభ్ గంగూలీ (534 పరుగులు) రికార్డ్ బ్రేక్ చేశాడు.
- టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా జైశ్వాల్ (12) , వసీమ్ అక్రమ్ రికార్డును సమం చేశాడు.
- టెస్టుల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీ (209 &214)లు బాదిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. జైశ్వాల్ కంటే ముందు వినోద్ కాంబ్లి (224&227 vs ఇంగ్లాండ్, 1992), విరాట్ కోహ్లీ (213 &243 vs శ్రీలంక, 2018) సాధించారు.
- రెండో ఇన్నింగ్స్‌లో ద్విశతకం బాదిన ఆరో టీమ్ఇండియా బ్యాటర్‌గా రికార్డు కొట్టాడు. ఇదివరకు మాక్ పతౌది, సర్దేశాయ్, సునీల్ గావస్కర్, లక్ష్మణ్, వసీమ్ జాఫర్ సాధించారు.
మరోవైపు డెబ్యూ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ 50+ స్కోర్ నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన సర్ఫరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే వరుస ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన నాలుగో బ్యాటర్హా నిలిచాడు. ఇంతకుముందు దిలావర్ హుస్సేన్ (59 & 57 vs ఇంగ్లాండ్), సునీల్ గావస్కర్ (65 & 67* vs వెస్టిండీస్), శ్రేయర్ అయ్యర్ (105 & 65 vs న్యూజిలాండ్) ఈ ఫీట్ సాధించారు.
జట్టులోకి అశ్విన్ రీ ఎంట్రీ - బీసీసీఐ క్లారిటీ
'యశస్వి యంగ్ సచిన్‌ను గుర్తుచేస్తున్నాడు- అతడు ఫ్యూచర్ సూపర్‌స్టార్'