ETV Bharat / sports

'నా సక్సెస్‌కి ఆ ఇద్దరే కారణం - ఆ అవార్డు అతడికే అంకితం' స్పెషల్ ఇంటర్వ్యూలో యశ్​ ఎమోషనల్ - IPL 2024 - IPL 2024

Yash Dayal RCB : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్కంఠ పోరులో చివరి ఓవర్‌లో అద్భుతం చేసి బెంగళూరును గెలిపించిన ఆ జట్టు ప్లేయర్ యశ్​ దయాల్‌పై ఇప్పుడు సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ యంగ్‌ బౌలర్‌ తన సక్సెస్‌ గురించి 'ఈటీవీ భారత్‌' ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే?

Yash Dayal
Yash Dayal (Source : Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 7:34 AM IST

Hyderabad : ఐపీఎల్‌ 2024లో దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాక, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్లేఆఫ్స్‌కి చేరుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఎప్పటిలానే ఆర్సీబీ టీమ్‌కి, ఫ్యాన్స్‌కి నిరాశ తప్పదనే విమర్శలు వచ్చాయి. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ, వరుసగా ఆరు విజయాలతో బెంగళూరు ప్లేఆఫ్స్‌కి చేరింది. తాజాగా బెంగళూరులో చెన్నైతో జరిగిన కీలక పోరులో ఆర్సీబీ 27 పరుగులతో విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అయితే ధోనీ, జడేజా వంటి స్టార్‌ ప్లేయర్‌లు క్రీజులో ఉండగా అద్భుతమైన బౌలింగ్‌తో ఆర్సీబీని గెలిపించిన యశ్‌ దయాల్‌ ఆర్సీబీ హీరోగా మారాడు. తాజాగా ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దయాల్‌, తన సక్సెస్‌, క్రికెట్‌ జర్నీ, టీమ్‌ సపోర్ట్‌ గురించి ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకున్నాడు.

చెన్నై ప్లేఆఫ్స్‌కి చేరాలంటే చివరి ఓవర్‌లో 17 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో సీనియర్‌ ప్లేయర్‌లు ధోనీ, జడేజా ఉన్నారు. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, యశ్ దయాల్‌కు బాల్‌ అందించాడు. దయాల్‌ వేసిన మొదటి బంతికే ధోనీ భారీ సిక్సర్‌ బాదాడు. అందరిలోనూ ఒత్తిడి మరింత పెరిగింది. కానీ యష్‌ దయాల్‌ తన ప్లాన్‌ని అమలు చేయడంపైనే ఫోకస్‌ చేశాడు. రెండో బంతికే ధోని భారీ షాట్‌కి ప్రయత్నించి, ఫీల్డర్‌ చేతికి చిక్కాడు. తర్వాత నాలుగు బాల్స్‌కి కేవలం ఒక్క రన్‌ మాత్రమే ఇచ్చిన యశ్​ దయాల్, ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కి చేర్చాడు.

ఈ 26 ఏళ్ల పేసర్ తన విజయాన్ని తల్లిదండ్రులకు అంకితం ఇచ్చాడు. 'ఇదంతా నా హార్డ్‌ వర్క్‌, విజువలైజేషన్, మజిల్ మెమరీ నుంచి వచ్చింది. ఇదంతా నిజంగా నా తల్లిదండ్రుల కృషి వల్లనే. నా స్కూల్‌ ఎడ్యుకేషన్‌పై జాగ్రత్త తీసుకున్నారు, స్పోర్ట్స్‌పై నాకున్న ఇంట్రెస్ట్‌ని సపోర్ట్‌ చేశారు.' అని చెప్పాడు. తల్లిదండ్రుల త్యాగాల వల్లనే ఇలా తాను ఓ సక్సెస్‌ఫుల్‌ క్రికెటర్‌గా ఎదిగానని తెలిపాడు.

ఆర్సీబీ టీమ్ మేనేజ్‌మెంట్, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల నుంచి తనకు లభించిన సపోర్ట్‌ని దయాల్ హైలైట్ చేశాడు. "ఈ ఘనత నా జట్టు ఆర్సీబీ, విరాట్, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, మహ్మద్ సిరాజ్, దినేశ్​ కార్తీక్‌కు చెందుతుంది. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండేందుకు వారు నాకు సహాయం చేశారు. టీమ్‌ వాతావరణం కూడా చాలా పాజిటివ్‌, సపోర్టివ్‌గా ఉంది." అని చెప్పాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడికి అంకితం
యశ్​ దయాల్‌ అద్భుతమైన ఆటతీరును మెచ్చుకుంటూ ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ తన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దయాల్​కు అంకితం చేశాడు. "నేను ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ని యశ్ దయాల్‌కి అంకితమిస్తున్నాను. అతను బౌలింగ్ చేసిన విధానం నమ్మశక్యం కాలేదు. యంగ్‌ బౌలర్‌గా అతను దానికి అర్హుడు. ఈ పిచ్‌పై పేస్ ఆఫ్ బెస్ట్‌ ఆప్షన్‌, అతను దాన్ని అద్భుతంగా అమలు చేశాడు" అని డు ప్లెసిస్ అన్నాడు. యశ్​ పర్ఫార్మెన్స్‌పై ఆర్సీబీ వికెట్ కీపర్, దినేష్ కార్తీక్ కూడా దయాల్ ప్రదర్శన చాలా కాలం పాటు గుర్తుండిపోతుందంటూ చెప్పాడు.

RCB నయా హీరో యశ్- అంతా అదృష్టం కలిసిరావడం వల్లే! - IPL 2024

'ఆ తర్వాత ఆరోగ్యం కూడా దెబ్బతింది'- రింకూ 5 సిక్స్​లు గుర్తుచేసుకున్న యశ్ దయాల్ - Yash Dayal IPL 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.