ETV Bharat / sports

WPL 2024 - దంచికొట్టిన ఆర్సీబీ - యూపీ వారియర్స్​పై విజయం - యూపీ వారియర్స్​పై ఆర్సీబీ విజయం

WPL 2024 UP Warriorz vs Royal Challengers : మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా నేడు(మార్చి 4) జరిగిన మ్యాచ్​లో యూపీ వారియర్స్​పై ఆర్సీబీ విజయం సాధించింది.

UP Warriorz vs Royal Challengers
UP Warriorz vs Royal Challengers
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 10:51 PM IST

Updated : Mar 5, 2024, 9:41 AM IST

WPL 2024 UP Warriorz vs Royal Challengers : మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా నేడు(మార్చి 4) జరిగిన మ్యాచ్​లో యూపీ వారియర్స్‌ - రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు తలపడ్డాయి. అయితే ఈ సీజన్‌-2లో వరుసగా రెండు ఓటముల అందుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఈ మ్యాచ్‌లో దంచికొట్టి విజయం సాధించింది. బ్యాటింగ్‌లో అదరగొట్టి బౌలింగ్‌లో సమష్టిగా సత్తా చాటింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా ఆర్సీబీ 23 పరుగులు తేడాతో విజయం సాధించింది.

అలీస్సా హెలీ(38 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్​ల సాయంతో 55 పరుగులు) టాప్ స్కోరర్​గా నిలిచింది. ఆ తర్వాత దీప్తి శర్మ(22 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 పరుగులు) పర్వాలేదనిపించింది. ఇక కిరణ్​, చమారి అటపట్టు, గ్రేస్ హ్యారిస్​, శ్వేత షెహ్రావత్​ విఫలమయ్యారు. చివర్లో వచ్చిన పూనమ్​ ఖెమ్నార్ మాత్రం​(31) దూకుడుగా ఆడి లక్ష్యం అంతర్యాన్ని కాస్త తగ్గించింది. ఆర్సీబీ బౌలర్లలో ఆశా శోభన, గార్జియా వారెహమ్​, సోఫీ డివైన్ సోఫీ మోలినెక్స్ తలో రెండు​ వికెట్లు తీశారు.

Royal Challengers Won the Match : అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్‌ స్మృతి మంధాన (80), ఎలీస్‌ పెర్రీ (58) అదరగొట్టడంతో 3 వికెట్లు కోల్పోయి 198 భారీ పరుగుల చేసింది. ఓపెనర్లు సబ్బినేని మేఘన (28), స్మృతి మంధాన (80) కలిసి మంచి శుభారంభానిచ్చారు. మొదటి వికెట్‌కు వీరు 51 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ తర్వాత అంజలి బౌలింగ్‌లో మేఘన షాట్​కు యత్నించి ఆటపట్టు చేతికి క్యాచ్‌ ఇచ్చి చిక్కింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ఎలీస్‌ పెర్రీతో కలిసి మంధాన దూకుడుగా ముందుకు వెళ్లింది. రిచా ఘోష్‌ (21*), సోఫీ (2*) నాటౌట్‌గా నిలిచారు. యూపీ బౌలర్లలో అంజలి, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్‌ తలో వికెట్ దక్కించుకున్నారు.

ధోని కెప్టెన్సీ వదిలేస్తున్నాడా? న్యూ రోల్‌ అంటూ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌

IPL 2024లో కేఎల్‌ రాహుల్‌ ఆడతాడా? లేదా? - కీలక అప్డేట్​

Last Updated : Mar 5, 2024, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.