ETV Bharat / sports

కారు అద్దం పగలగొట్టిన ఆర్సీబీ బ్యాటర్ - ఇది నెక్ట్స్​ లెవల్ హిట్టింగ్ బాస్​! - car window rcb player

WPL 2024 UP Warriors VS RCB : యూపీ వారియర్స్​తో జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ ప్లేయర్​ బాదిన ఓ భారీ సిక్సర్​ దెబ్బకు కారు అద్దం పగిలిపోయింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​ అవుతోంది. దీనికి నెటిజన్లు తెగ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

కారు అద్దం పగలగొట్టిన ఆర్సీబీ బ్యాటర్ - ఇది నెక్ట్స్​ లెవల్ హిట్టింగ్ బాస్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 10:24 AM IST

Updated : Mar 5, 2024, 2:20 PM IST

WPL 2024 UP Warriors VS RCB : మహిళల ప్రీమియర్‌ లీగ్‌-2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మరో అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్​లో యూపీ వారియర్స్​పై 23 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు దంచికొట్టేలా బ్యాటింగ్ చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు.

అయితే ఆర్సీబీ ఇన్నింగ్స్‌ ఆడేటప్పుడు ఓ అనుహ్య సంఘటన జరిగింది. ఆర్సీబీ స్టార్‌ ఎల్లీస్‌ పెర్రీ బాదిన ఓ భారీ సిక్సర్‌ దెబ్బకు ఏకంగా కారు అద్దం పూర్తిగా పగిలిపోయింది. ముక్కలు అయిపోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్ లాస్ట్ బాల్​ను పెర్రీ లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్‌గా మలిచింది. అయితే ఆ బంతి డైరెక్ట్​గా వెళ్లి డిస్‌ప్లే బాక్స్‌లో ఉన్న కారు అద్దానికి బలంగా తాకింది. దీంతో ఆ కారు అద్దం పూర్తిగా పగిలిపోయింది.

ఇది చూసిన క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పెర్రీ కూడా తలపై చేతులు వేసుకుని అయ్యో అన్నట్లుగా రియాక్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఏంత పని చేశావ్​ పెర్తీ, నీకు జీతం కట్ అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా, డబ్ల్యూపీఎల్ ప్రస్తుత సీజన్ పూర్తైన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుగా ఈ కారును అందజేసేందుకు డిస్​ ప్లే బాక్స్​లో పెట్టారు. కానీ ఇప్పుడు దాని అద్దమే పగిలిపోయింది.

ఇకపోతే మ్యాచ్‌ అనంతరం కారు అద్దం పగలడంపై పెర్రీ సరదాగా మాట్లాడింది. "ఆ కారుకు జరిగిన నష్టం చెల్లించడానికి నాకు బీమా ఉందో లేదో తెలీదు" అని పేర్కొంది. ఇంకా భారత్‌లోని ప్రేక్షకులపై ప్రశంసలు కురిపించింది. "నేను ఆడిన ఐదు మ్యాచ్‌లు మంచి అనుభవాన్నిచ్చాయి. నా కెరీర్‌లో ఇక్కడ అద్భుతమైన వాతావరణం చూశాను. ప్రేక్షకుల నుంచి జట్టు సభ్యులకు దక్కుతున్న మద్దతు చాలా బాగుంది. ఈ మ్యాచ్‌లో స్మృతికి తోడుగా నిలవడమే నా బాధ్యత. ఆ తర్వాత నేను స్వేచ్ఛగా ఆడాను. లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ కాస్త విభిన్నంగా ఉంటుంది. నేడు మావాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నాం" అని చెప్పుకొచ్చింది.

ఓ వైపు ఆసక్తి - మరోవైపు టెన్షన్​ - సీఎస్కే కొత్త కెప్టెన్ అతడేనా?

తెలుగు స్టార్ షట్లర్​ సాయి ప్రణీత్‌ సాధించిన రికార్డులివే

Last Updated : Mar 5, 2024, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.