WPL 2024 Opening Ceremony: ఐపీఎల్ (Indian Premier League) కంటే ముందే క్రికెట్ లవర్స్‌కు వినోదం పంచేందుకు డబ్ల్యూపీఎల్ (Women's Premier League) సిద్ధమైంది. 2024 మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నీ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. ఐదు ఫ్రాంచైజీలతో 2023లో ప్రారంభమైన ఈ లీగ్ సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈసారి మరింత జోష్‌తో రానుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి- దిల్లీ మధ్య మ్యాచ్‌తో రెండో ఎడిషన్ ఫిబ్రవరి 23న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. కాగా, డబ్ల్యూపీఎల్‌లో సింగిల్ హెడర్లు మాత్రమే ఉంటాయి. లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఎలిమినేటర్‌లో నెగ్గిన జట్టు తుదిపోరుకు అర్హత సాధిస్తుంది
ఇక ఫిబ్రవరి 23న తొలి మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ కార్యక్రమం ఉండనుంది. ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేసేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌తోపాటు టైగర్ జాకీఫ్రాఫ్, వరణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తిక్ ఆర్యన్, పలువురు సింగర్లు హాజరై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఓపెనింగ్ ఈవెంట్ ఫిబ్రవరి 23న సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ ఎడిషన్‌లో టోర్నీలో మ్యాచ్‌లకు బెంగుళూరు, దిల్లీ నగరాలు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ సీజన్లో ప్లేఆఫ్స్ సహా మొత్తం 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదట 11 మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతాయి. ఆ తర్వాత మిగిలిన 9 లీగ్ మ్యాచ్‌లతోపాటు రెండు ఫ్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు దిల్లీ అరుణ్ జైట్లి స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
కాగా, రెండోసారి కూడా టైటిల్ నెగ్గాలన్న కసితో ముంబయి బరిలోకి దిగగా, తొలి ఎడిషన్‌లో మిస్సైన కప్‌ను ఈసారైన ఒడిసిపట్టాలని దిల్లీ భావిస్తోంది. మిగిలిన జట్లు యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా టైటిల్‌పై కన్నేశాయి. అన్ని మ్యాచ్ కూడా సాయంత్రం 7.30గంటలకు ప్రారంభం అవుతాయి. డబ్ల్యూపీఎల్ అన్ని మ్యాచ్‌లను బ్రాడ్‌కాస్టింగ్ ఛానెల్ స్పోర్ట్స్ 18లో, అలాగే జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్‌లో చూడవచ్చు.
ఆయా జట్లు, కెప్టెన్లు
- ముంబయి ఇండియన్స్- హర్మన్ ప్రీత్ కౌర్
- దిల్లీ క్యాపిటల్స్- మెగ్ లానింగ్
- గుజరాత్ జెయింట్స్- బెత్ మూనీ
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- స్మృతి మంధాన
- యూపీ వారియర్స్- అలిస్సా హిలీ
WPL 2024కు రంగం సిద్ధం - అమ్మాయిలు రెడీగా ఉన్నారా?
ఆసీస్ కెప్టెన్ చేసిన పనికి భారత జట్టు ఫైర్ - హర్మన్‌కు అంత కోపం వచ్చిందా!