ETV Bharat / sports

WPL 2024 - ఆర్సీబీపై విజయం - పాయింట్స్​ టేబుల్ టాప్​లోకి ముంబయి

WPL 2024 Mumbai Indians VS RCB : WPL 2024లో నేడు(మార్చి 2) జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్​పై ముంబయి విజయం సాధించింది.

mumbai indians vs rcb
mumbai indians vs rcb
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 10:24 PM IST

Updated : Mar 2, 2024, 10:43 PM IST

WPL 2024 Mumbai Indians VS RCB : WPL 2024లో నేడు(మార్చి 2) జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ఈ పోరులో ముంబయి విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్​లో 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది. 15.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి గెలుపొందింది.

ముంబయి బ్యాటర్లలో అమేలియా కేర్​(24 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 40) టాప్ స్కోరర్​గా నిలిచింది​. యస్తికా భాటియా(15 బంతుల్లో 2 సిక్స్​లు, 4 ఫోర్లు సాయంతో 31), సీవర్ బ్రంట్​(25 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 27), హెలీ మ్యాథ్యూస్​(21 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్​తో 26) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో సోఫీ డివైన్​, గార్జియా వారెహమ్​, శ్రేయంక పాటిల్​ తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)ను ముంబయి తక్కువ పరుగులకే కట్టడి చేసింది. 14 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది ఆర్సీబీ. ఆ తర్వాత ఏ దశలోనూ భారీ స్కోరు దిశగా ముందుకు వెళ్లేదు. ఓపెనర్లు కెప్టెన్‌ స్మృతి మంధాన (9), సోఫి డెవిన్‌ (9) పరుగులు చేయలేక ఫెయిల్ అయ్యారు. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచుల్లో మంచిగా రాణించిన తెలుగు అమ్మాయి సబ్బినేని మేఘన (11) ఈ సారి సరైన ప్రదర్శన చేయలేకపోయింది. ఇక వరుసగా వికెట్లు పడుతున్నా ఎలిస్‌ పేర్రి ఒక్కటే(33 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 44*) పరుగులు చేసి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించింది. జార్జియా వేర్‌హామ్ 27 పరుగులతో పర్వాలేదనిపించింది. ముంబయి బౌలర్లలో నాట్ స్కివర్, పూజా వస్త్రాకర్ తలో రెండు, ఇస్సీ వాంగ్, సైకా ఇషాక్ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

WPL 2024 Points Table : ఈ విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్ పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో నెగ్గి 6 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ (4), యూపీ (4), బెంగళూరు (4), గుజరాత్‌ (0) ఉన్నాయి.

అందుకే అయ్యర్‌పై వేటు పడింది - అసలు కారణమిదే!

50 మంది అతిథులకు రూ.100 కోట్ల ఖర్చు - క్రికెటర్లలో అత్యంత ఖరీదైన పెళ్లి ఎవరిదంటే?

Last Updated : Mar 2, 2024, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.