WPL 2024 DC vs UP : WPL 2024 ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ జట్టు సత్తా చాటింది. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ విజయం సాధించింది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీని 137 పరుగులకే కట్టడి చేసింది. దీప్తి శర్మ నాలుగు వికెట్లు తీసి దిల్లీ పతనాన్ని శాసించింది. ఓపెనర్ మెగ్ లాన్నింగ్ 46 బంతుల్లో 60 పరుగులతో పోరాడినా ఫలితం లేకుండాపోయింది.
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన యూపీ జట్టు 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. దీప్తి శర్మ (59) బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించింది. ఎలీసా హీలే (29) రాణించారు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. గ్రేస్ హారిస్ (14) మినహా ఎవరూ రెండంకెల పరుగులు చేయలేదు. యూపీ బౌలర్లలో రాధా యాదవ్, టిటాస్ సధు చెరో 2, అరుంధతి రెడ్డి, షికా పాండే, జెస్ జొనాసెన్, ఎలిస్ కాప్సీ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అయితే మొదట యూపీ జట్టును దిల్లీ బౌలర్లు కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. 10 పరుగులకే కిరణ్ నవ్‌గిరె (5) వికెట్ పడినప్పటికీ దీప్తిశర్మ, అలీసా హీలీ (29) నిలవడంతో యూపీ 8.3 ఓవర్లకు 56/1తో నిలిచింది. కానీ అలీసా ఔటయ్యాక, దీప్తికి సరైన పార్ట్నర్ దొరకలేదు. దీంతో 45 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయి ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ అర్ధసెంచరీ చేసిన దీప్తి శర్మ ఆఖరి ఓవర్‌దాకా నిలిచి జట్టుకు అండగా నిలిచింది.
అంతకుముందు చెలరేగి ఆడిన దిల్లీ జట్ట కెప్టెన్ మెగ్ లానింగ్ (60)ను 14వ ఓవర్ చివరి బంతికి దీప్తి పెవిలియన్ బాట పట్టించింది. ఆ తర్వాత 19వ ఓవర్లో తొలి రెండు బంతులకు అనాబెల్ (6), అరుంధతి (0)లను ఔట్ చేసింది. అలా హ్యాట్రిక్ వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. అయితే నాలుగో బంతికి వచ్చిన శిఖ పాండే (4) వికెట్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. దాంతో ఆ ఓవర్లో 5 పరుగులే వచ్చాయి.
ఇక గ్రేస్ హారిస్ వేసిన చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా, తొలి బంతికే రాధ సిక్సర్ కొట్టడం వల్ల ఇక యూపీ పనైపోయినట్లే అని అనిపించింది. కానీ మూడో బంతి నుంచి వరుసగా మూడు వికెట్లు పడటం వల్ల దిల్లీ ఓటమిని చవి చూసింది. మూడో బంతికి రాధ (9)ను గ్రేస్ బౌల్డ్ చేయగా, ఆ తర్వాతి బంతికి జెస్ (11) రనౌటైంది. మరోవైపు అయిదో బంతికి తితాస్ (0) ఔటవడం వల్ల దిల్లీ జట్టు ఆలౌటైంది. దీంతో ఒక్క పరుగు తేడాతో యూపీ విజయాన్ని కైవసం చేసుకుంది.
WPLలో బోణీ కొట్టిన గుజరాత్- RCBపై విజయం
షబ్నిమ్ వరల్డ్ రికార్డ్- మహిళల క్రికెట్లో ఫాస్టెస్ట్ బంతి