Womens Day 2024 Women Athletes India: క్రీడాకారులు అనగానే గతంలో పురుషుల సంఖ్యే అత్యధికంగా ఉండేది. ఏవో కొన్ని ఆటల్లో మాత్రమే మహిళలు కనిపించేవారు. ఇంకొన్ని ఆటలు పురుషులకే అన్నట్లు ఉండేవి. అయితే అలాంటి రోజులను దాటుకొని ప్రస్తుతం మహిళలు అన్ని రకాల క్రీడల్లో రాణిస్తూ ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరి మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడారంగంలో సత్తా చాటిన భారత అథ్లెట్లు ఎవరో చూద్దామా!
పీవీ సింధు: ఈ తరం యువతులకు పీవీ సింధు పరిచయం అక్కర్లేని పేరు. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ ఆటల్లో ఏకంగా రెండు మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించింది. భారత్ సహా పలు దేశాల్లో అనేక ఛాంపియన్షిప్స్ పోటీల్లో పాల్గొని ఘన విజయాలు సాధించి బ్యాడ్మింటన్‌లో తన మార్క్ చూపింది. ఇక ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగానూ సింధు చరిత్ర సృష్టించింది.
మిథాలీ రాజ్: జెంటిల్మెన్ గేమ్‌గా పేరున్న క్రికెట్లో టీమ్ఇండియా మాజీ ప్లేయర్ మిథాలీ రాజ్ అనేక రికార్డులు నెలకొల్పింది. మహిళల క్రికెట్లో తనదైన ముద్ర వేస్తూ భారత్‌కు అనేక విజయాలు అందించింది. మహిళల క్రికెట్లో ఏకంగా ప్రపంచంలోనే అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ప్లేయర్‌గా మిథాలీ (7805 పరుగులు) చరిత్ర సృష్టించింది.
సానియా మీర్జా: స్టార్ అథ్లెట్ సానియా మీర్జా 2003 నుంచి ఓ దశాబ్ద కాలంపాటు భారత టెన్నిస్‌ను ఏలింది. తన కెరీర్లో 6 మేజర్ టైటిళ్లు సాధించి టెన్నిస్‌లో తన మార్క్ చూపించింది. డబుల్స్‌లో వరల్డ్ నెం.1 ర్యాంక్‌ను సైతం సొంతం చేసుకుని ప్రపంచానికి తనేంటో చూపించింది. ఇక భారత్‌లోనూ సింగిల్స్‌లో ఇప్పటివరకు అత్యధిక రోజులు నెం. 1 ర్యాంక్‌లో కొనసాగింది కూడా సానియానే.
హర్మన్‌ప్రీత్ కౌర్: మిథాలీ రాజ్ తర్వాత భారత క్రికెట్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టే బాధ్యతలు హర్మన్‌ప్రీత్ కౌర్ తీసుకుంది. హర్మన్ కెప్టెన్సీలో గతేడాది జరిగిన టీ20లో వరల్డ్‌కప్‌లో భారత్‌ను సెమీస్‌దాకా తీసుకెళ్లింది.
వీళ్లతోపాటు బాక్సింగ్ క్వీన్ మేరీ కోమ్, జిమ్నాస్టిక్స్‌లో దీపా కర్మాకర్, బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, స్ర్పింటర్లో ద్యూతీ చంద్, వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానూ, రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సాధించిన ఘనతలు ఎందరికో ఆదర్శం.
ఆసియా బ్యాడ్మింటన్‌లో సింధు అదుర్స్- 3-2 తేడాతో చైనాపై భారత్ విక్టరీ