WOMENS ASIA CUP T20 2024 IND VS NEPAL : మహిళల టీ20 ఆసియాకప్ మెగా టోర్నీలో టీమ్ఇండియా దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ మెగాటోర్నీలో రెండు విజయాలు నమోదు చేసిన భారత అమ్మాయిల జట్టు ఇప్పుడు మరో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. మూడో మ్యాచ్‌లో నేపాల్‌పై 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీస్‌కు దూసుకెళ్లింది.
179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 96 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. ఈ ప్రత్యర్థి జట్టు భారత్‌కు ఏ పరిస్థితుల్లోనూ పోటీ ఇవ్వలేకపోయింది. జట్టులో సీతా రానా మగర్ 18 టాప్ స్కోరర్. ఇందు బర్మ(14), రుబినా ఛెత్రి!5) పరుగులు చేశారు. బిందు రావల్(17) రన్స్ చేసింది. దీప్తి శర్మ 3, అరుంధతి రెడ్డి 2, రాధా యాధవ్ 2, రేణుకా ఠాకూర్ సింగ్ ఒక వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఓపెనర్లలో షెఫాలీ వర్మ (48 బంతుల్లో 81; 12×4, 1×6) హాఫ్ సెంచరీతో విజృంభించగా,.హేమలత ( 42 బంతుల్లో 47; 5×4, 1×6) మంచిగా రాణించింది.. నేపాల్ బౌలర్లలో సీతారాన మగర్ 2 వికెట్లు తీయగా, కబితా జోషి ఒక వికెట్ దక్కించుకుంది.
కాగా, ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. నేపాల్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అయితే జట్టు స్కోరు 122 పరుగుల వద్ద ఉండగా రుబీనాకు క్యాచ్ ఇచ్చి హేమలత ఔట్ అయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సజన (10)తో కలిసి షెఫాలీ వర్మ మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లింది కానీ 15.3వ ఓవర్‌కు స్టంపౌట్ అయింది. అనంతరం స్వల్ప వ్యవధిలోనే సజన కూడా ఎల్బీగా వెనుదిరిగింది. చివర్లో రోడ్రిగ్స్ (15 బంతుల్లో 28*; 5×4), రిచా ఘోష్ (3 బంతుల్లో 6; 1×4) దూకుడుగా ఆడారు. దీంతో భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టీ20 ప్రపంచకప్ నిర్వహణలో ఆర్థిక మోసాలు! - ఐసీసీ కీలక నిర్ణయం - ICC T20 Worldcup 2024