Wimbledon 2024 Novak Djokovic Fire on Audience : వింబుల్డెన్ 2024 ఎడిషన్‌లో స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ప్రేక్షకుల తీరుపై మరోసారి అసహనం వ్యక్తం చేశాడు. అలానే ఓ రిపోర్టర్‌పై కాస్త అగ్రహం వ్యక్తం చేశాడు. ఇంటర్వ్యూ మధ్యలో నుంచే లేచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే? - జులై 9న డెన్మార్క్‌కు చెందిన ప్రత్యర్థి రూనెతో మ్యాచ్‌లో తలపడ్డాడు జకోవిచ్. అయితే ఓ పాయింట్ విషయంలో జకోవిచ్ అప్పీలు చేశాడు. అప్పుడు రూనెకు మద్దతుగా నినాదాలు చేశారు కొందరు ప్రేక్షకులు. అదే సమయంలో విపరీతంగానూ ప్రవర్తించారు. దీంతో మైదానంలోనే జకోవిచ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరు కనీసం నన్ను టచ్ కూడా చేయలేరు అంటూ వ్యాఖ్యానించాడు.
ఇక జులైన 10న జరిగిన క్వార్టర్ ఫైనల్లో నాలుగో రౌండ్ మ్యాచ్ ముగిశాక జకోవిచ్ ఓ రిపోర్టర్‌తో మాట్లాడు. ఆ సమయంలోనూ జకోవిచ్ మాట్లాడుతుంటే ప్రేక్షకులు గట్టిగా అరుపులతో హోరెత్తించారు. దీంతో జకోవిచ్ మరోసారి తీవ్రంగా అసహనం వ్యక్తం చేశాడు. కొందరు తమ పరిధిని దాటి ప్రవర్తించారని, అలా చేయడం సరైనది కాదని అన్నాడు.
"మ్యాచ్ ముగియగానే జరిగే ఇంటర్వ్యూలో ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ ఉంటాను. ఎందుకంటే రోజంతా టెన్నిస్ చూస్తూప్లేయర్స్ను ప్రోత్సహించడం అంత ఈజీ కాదు దీని కోసం వారికి నేను ధన్యవాదాలు చెబుతాను. ఇప్పటికీ నేను ఆడుతున్నానంటే అందుకు కారణం వారి మద్దతే. కానీ ఈరోజు కొందరు హద్దులు దాటి ప్రవర్తించారు. ఇలాంటప్పుడు కచ్చితంగా వెంటనే స్పందిస్తాను. కోర్టులో నేను చేసిన వ్యాఖ్యలకు, చర్యలకు నేనేమి పశ్చాత్తాపం పడాల్సిన అవసరమే లేదు" అని చెప్పాడు.
అయితే ఇదే ఇంటర్వ్యూలో రిపోర్టర్ మరోసారి ప్రేక్షకులకు సంబంధించి ప్రశ్ననే జకోవిచ్‌ను అడిగారు. ఈ విషయంలో జకోవిచ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ టాపిక్ కాకుండా మరే ఇతర ప్రశ్నలు లేవా? ఇప్పటికే మూడు అడిగారు అంటూ ప్రతిస్పందించాడు. ఇంటర్వ్యూలో మధ్యలోనే వాకౌట్ చేశాడు. అలా ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమైంది.
అగ్రస్థానాన్ని కోల్పోయిన హార్దిక్ - అదరగొట్టిన గైక్వాడ్, అభిషేక్ శర్మ - ICC Latest T20 Rankings
పాక్ సెలక్టర్లకు PCB షాక్- రియాజ్, రజక్ పదవులు ఔట్- వరల్డ్‌కప్ ఓటమే కారణం!