Dravid Played For Scotland : టీమ్ఇండియా మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్‌ను క్రికెట్ ప్రియులు 'ది వాల్' గా అభివర్ణిస్తారు. అంతలా భారత్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ద్రవిడ్ అండగా నిలిచాడు. వరుసగా వికెట్లు కుప్పకూలిపోతున్నా, దిగ్గజ బౌలర్లను సైతం ఎదురొడ్డి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించేవాడు. అయితే ద్రవిడ్ టీమ్ఇండియా తరఫునే కాకుండా స్కాట్లాండ్ తరఫున కూడా ఆడాడనే విషయం మీకు తెలుసా?
12 మ్యాచ్‌లు
2003 వన్డే ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ స్కాట్లాండ్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో ఆడాడు. 12 మ్యాచ్‌లలో 11 ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ చేసి 600 పరుగులు బాదాడు. అందులో 3 సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు ఏకంగా 66.66 ఉండడం గమనార్హం. అయితే ద్రవిడ్ ఆడిన 12 మ్యాచ్‌లో స్కాట్లాండ్ 11 మ్యాచుల్లో ఓటమిపాలైంది.
స్కాట్లాండ్ తరపున ఎందుకు ఆడాడు?
రాహుల్ ద్రవిడ్ స్కాట్లాండ్లో ఉన్న సమయంలో నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐ) బృందం కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవిడ్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో ఆడగా వచ్చిన డబ్బు, ఇతర కార్యక్రమాల ద్వారా వచ్చిన నగదు మొత్తం కలిపి £45,000 యూరోలను సేకరించింది. ఈ మొత్తాన్ని ఛారిటీలకు అందించారు.
కీలక ప్లేయర్‌గా ఉన్నప్పుడే!
కాగా, స్కాట్లాండ్ లీగ్‌లో ఆడేటప్పుటికీ రాహుల్ ద్రవిడ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. టీమ్ఇండియా తరఫున చురుకైన బ్యాటర్ కమ్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. అయినప్పటికీ స్కాట్లాండ్ లీగ్‌లో ఆడాడు. కాగా, రాహుల్ ద్రవిడ్ అన్ని ఫార్మాట్లలో కలిపి టీమ్ఇండియాకు 1996-2012 వరకు ఆడాడు. 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 20వేలకు పైగా పరుగులు చేశాడు.
A throwback to when world class batter and current India Men's head coach Rahul Dravid donned the Saltire in 2003 🏴 pic.twitter.com/2yAkYBEhk7
— Cricket Scotland (@CricketScotland) November 18, 2021
అంతర్జాతీయ క్రికెటర్లు వేరే దేశం తరఫున ఆడడం చాలా అరుదు. ఆసీస్ జట్టు తరఫున ఓపెనర్‌గా ఆడిన బర్న్స్, ఈ ఏడాది మేలో ఇటలీకి వెళ్లాడు. 2024 జూన్‌లో ఇటలీ తరఫున అరంగేట్రం చేసిన బర్న్స్, ఇటీవలే ఇటలీ జట్టుకు కెప్టెన్‌గానూ ఎంపికయ్యాడు. ఇలా చాలా మంది తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం రాకపోతే వేరే దేశం తరఫున ఆడుతుంటారు. అయితే అప్పటికే స్టార్ క్రికెటర్‌గా పేరొందిన ద్రవిడ్ స్కాట్లాండ్ తరఫున ఆడడం మాత్రం కాస్త సంచలనమే అని చెప్పాలి.
ఇట్స్ IPL టైమ్- రాజస్థాన్‌కు కోచ్‌గా ద్రవిడ్?
'డబ్బులిస్తే నా బయోపిక్‌లో నేనే నటిస్తా' - Rahul Dravid Biopic