ETV Bharat / sports

IPL 2025, ఈ దశాబ్దంలోనే అతిపెద్ద మెగా వేలం - ఎందుకో తెలుసా? - IPL 2025 MEGA AUCTION

2025 ఐపీఎల్‌ మెగా వేలం - ఆసక్తికర విషయాలు ఇవే.

IPL 2025 Mega Auction
IPL 2025 Mega Auction (source IANS)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 20, 2024, 8:15 AM IST

IPL 2025 Mega Auction : ఒక్కో సీజన్‌ పూర్తయ్యే కొద్దీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. రాబోయే 2025 సీజన్‌ను మరచిపోలేనిదిగా మార్చేందుకు బీసీసీఐ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పెరిగిన బడ్జెట్‌లు, వేలంలోకి ప్రవేశించే ప్రధాన ఆటగాళ్ళు, యంగ్ ప్లేయర్స్​, ఇంకా కొత్త నిబంధనలతో 2025 ఐపీఎల్ అంచనాలను మరింత పెంచుతోంది. ఈ సీజన్‌ కోసం మొత్తం శ్యాలరీ క్యాప్​ పరిమితిని రూ.120 కోట్లకు పెంచారు. ఇందులో వేలం పర్స్, పనితీరు బోనస్‌లు, మ్యాచ్ ఫీజులు కలిపి ఉంటాయి. అయితే ఈ దశాబ్దంలోనే 2025 ఐపీఎల్ మెగా వేలం అతిపెద్దదిగా అవతరించనుంది. ఎందుకంటే? అందుకు గల కారణాలను తెలుసుకుందాం.

ఏకంగా రూ.120 కోట్లు - 2008 మొదటి సీజన్‌లో ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా రూ.21.75 కోట్లు మాత్రమే ఖర్చు చేయాలి. కానీ ఈ సంవత్సరం అతి చిన్న మొత్తంతో వేలంలో పాల్గొంటున్న రాజస్థాన్ రాయల్స్ వద్దనే రూ.41 కోట్లు ఉండటం గమనార్హం. ప్రారంభ సీజన్‌తో పోలిస్తే అప్పటి గరిష్ఠ పరిమితి కన్నా ఇది దాదాపు రెట్టింపు. ఇక ఈ ఏడాది ఏకంగా ఆక్షన్ పర్స్​ రూ.120 కోట్లు.

జెడ్డాలో మెగా వేలం - 2025 ఐపీఎల్‌ మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25న రెండు రోజుల పాటు జరుగుతుంది. ఈ వేలానికి ఏకంగా 1,574 మంది ప్లేయర్లు రిజిస్టర్‌ చేసుకున్నారు. వీరిలో 409 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​లకు చెందిన స్టార్‌ ప్లేయర్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే వీరందరిలో 574 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు నిర్వాహకులు.

టీమ్‌ ఇండియా స్టార్ ప్లేయర్లు - ఈ వేలంలో భారత జట్టు స్టార్‌ ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారు. గతేడాది ఐపీఎల్‌లో కెప్టెన్లుగా ఉన్న రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌ అందుబాటులో ఉన్నారు.

రిషబ్ పంత్ - రిషబ్‌ పంత్‌ ఇప్పటికే బ్యాటింగ్, వికెట్ కీపింగ్, కెప్టెన్సీలో సత్తా చాటాడు. మూడు రకాలుగా ఉపయోగపడే పంత్‌కు ఈ వేలంలో భారీ ధర దక్కుతుందని భావిస్తున్నారు. గత ఏడాది రూ.24.75 కోట్లతో అత్యధిక ధర రికార్డు నెలకొల్పిన మిచెల్ స్టార్క్‌ను అధిగమించే అవకాశం ఉందని చెబుతున్నారు.

కేఎల్ రాహుల్ : ఈ వేలంలో రాహుల్ కూడా రికార్డు స్థాయి ధర పలికే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ప్లేయర్‌గా చాలా సీజన్లు ఆడాడు, కెప్టెన్‌గా చేసిన అనుభవం కూడా ఉంది.

శ్రేయాస్ అయ్యర్ : 2024 ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌కు టైటిల్‌ అందించిన కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌. ఇప్పుడు వేలంలో అందుబాటులో ఉన్నాడు. కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ కోసం వెతికే ఫ్రాంచైజీలు అయ్యర్‌ కోసం పోటీ పడే అవకాశం ఉంది.

స్టార్‌లను రిటైన్‌ చేసుకున్న ఫ్రాంచైజీలు - వేలానికి ముందే ప్లేయర్ రిటెన్షన్‌లతో 2025 ఐపీఎల్ సీజన్‌ రికార్డులను బద్దలు కొట్టింది. హెన్రిచ్ క్లాసెన్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన రిటెన్షన్‌ ప్లేయర్​గా నిలిచాడు. అతడితో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఏకంగా రూ.23 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. విరాట్‌ కోహ్లి (ఆర్సీబీ రూ.21 కోట్లు), నికోలస్ పూరన్ (లఖ్‌నవూ రూ.21 కోట్లు)తో ఊహించని ధర అందుకున్నారు.

అత్యధికంగా ఏ జట్టు వద్ద డబ్బు ఉందంటే?

ఈ వేలంలో కొన్ని ఫ్రాంచైజీల పర్సులో పెద్ద మొత్తంలో డబ్బు ఉంది. దీంతో కొందరు స్టార్‌లు రికార్డు స్థాయి ధర పలకవచ్చు.

పంజాబ్ కింగ్స్: రూ.110.5 కోట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ.83 కోట్లు

దిల్లీ క్యాపిటల్స్: రూ.73 కోట్లు

వేలంలో పాల్గొంటున్న కీలక ఓవర్సీస్ ప్లేయర్లు

ఈ సారి చాలా మంది కీలక విదేశీ ప్లేయర్లు వేలంలో అందుబాటులో ఉన్నారు. ఈ లిస్టులో జోస్ బట్లర్, మిచెల్ స్టార్క్, కగిసో రబాడ, డేవిడ్ మిల్లర్ ఉన్నారు. ఆసక్తికరంగా ఇంగ్లాండ్​కు చెందిన లెజెండరీ పేసర్ జేమ్స్ ఆండర్సన్, మొదటి సారిగా రూ.1.25 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి ప్రవేశించాడు. అలా ఈ కారణాల వల్ల ఐపీఎల్ 25 మెగా వేలం ఈ దశాబ్దంలోనే అతి పెద్ద వేలం కానుంది.

IPL 2025 మెగా వేలం ప్లేయర్ల ఫైనల్ లిస్ట్ ఇదే - మొత్తం ఎంత మంది అంటే?

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ - ఆసీస్​ గడ్డపై కోహ్లీ, రోహిత్​ రికార్డులు ఎలా ఉన్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.