Paris olympics 2024 Viral Shooter Yusuf Dikec : యూసుఫ్ డికెక్ ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఈ 51ఏళ్ల తుర్కిష్ షూటర్ స్టైల్‌కు చాలా మంది సామాన్యులు, ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ఎందుకంటే మను, సరబ్జోత్ కాంస్య పతకం గెలుచుకున్న మ్యాచ్‌లోనే ఈ యూసుఫ్ డికెక్ కూడా తన షూటింగ్ పార్ట్నర్తో సెవ్వల్ ఇల్యాదా తర్హాన్లతో కలిసి రజత పతకం సాధించాడు. అది కూడా మాములు కళ్లద్దాలు ధరించి, ఒక చేతిని జేబులో పెట్టుకుని స్టైల్‌గా షూటింగ్ చేసి సిల్వర్ మెడల్‌ను దక్కించుకున్నాడు. దీంతో అతడు ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారాడు.
సాధారణంగా షూటింగ్‌లో పాల్గొనే అథ్లెట్లు ఎవరైనా సరే తమ చెవులకు ఇయర్ ప్రొటెక్టర్లు ఉపయోగిస్తారు. అలాగే లక్ష్యాన్ని గురి చూసేందుకు కూడా లెన్సులు, బ్లైండర్ల వంటి పరికరాలను ధరిస్తారు. కంటిపై పడే వెలుతురును తగ్గించేందుకు ఒక కన్నుపై వైజర్, స్పష్టమైన దృష్టి కోసం మరో కంటిపై బ్లైండర్ను ధరిస్తారు.
కానీ, యూసుఫ్ డికెక్ మాత్రం ఇవేవీ లేకుండానే షూటింగ్ చేసి లక్ష్యాన్ని ఛేదించాడు. కేవలం చాలా చిన్న ఇయర్ ప్లగ్స్ మాత్రమే చెవుల్లో పెట్టుకుని షూటింగ్ చేశాడు. గురి తప్పకుండా షాట్స్ పేల్చి రజతాన్ని సాధించాడు.
Video clip of Yusuf Dikeç at the Olympics taking taking the shot that became an international sensation: pic.twitter.com/vrNP2xr3yX
— Adrian Dittmann (@AdrianDittmann) August 1, 2024
సోషల్ మీడియాలో భారీగా కామెంట్లు - యూసుఫ్ ఫోటోను సోషల్ మీడియాలో చూస్తున్న చాలా మంది స్పందిస్తున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ వరకు ఎంతో మంది రియాక్ట్ అవుతున్నారు. కాఫీ తాగుదామని వెళ్తూ, షూటింగ్ కోసం ఆగినట్లున్నారు, ఒక చేతిని జేబులో పెట్టుకోకపోయి ఉంటే ఏకంగా స్వర్ణాన్ని గెలిచేవారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎవరీ యూసుఫ్ డికెక్? - 51 ఏళ్ల యూసుఫ్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇదేం తొలిసారి కాదు. 2008 నుంచి సమ్మర్ ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్నాడు. అలా ఈ పారిస్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత ఈవెంట్‌లో 13వ స్థానంలో నిలిచాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో పతకం సాధించాడు. అలానే 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం సాధించిన మెడల్ తుర్కియె ప్రజలకు అంకితం అని చెప్పుకొచ్చాడు.
నచ్చినవి ధరించవచ్చు - ఒలింపిక్స్‌లో షూటర్లు తమకు నచ్చినవి ధరించి పోటీలో పాల్గొనచ్చు. అందుకే షూటర్లు చాలా మంది వైజర్లు, బ్లైండర్ ధరించి లక్ష్యంపై గురి పెడుతుంటారు. ఇకపోతే గోల్డ్ మెడల్ దక్కించుకున్న చైనా రైఫిల్ షూటర్ లియు యుకున్ కూడా యూసుఫ్లానే ఇయర్‌ప్లగ్‌లు మాత్రమే ధరించి బరిలోకి దిగాడు. వైజర్, బ్లైండర్ వంటివి ధరించలేదు.
లైవ్ పారిస్ ఒలింపిక్స్ : సెమీస్‌లో ధీరజ్, అంకితకు నిరాశ - Paris Olympics 2024
ఒలింపిక్ మెడలిస్ట్ స్వప్నిల్‌కు డబుల్ ప్రమోషన్ - రైల్వే శాఖలో పదోన్నతి - Paris Olympics 2024