Team India Batting Coach : టీమ్ఇండియా బ్యాటర్ల ప్రదర్శన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కాస్త ఆకట్టుకున్నా, మళ్లీ వైఫల్యాల బాట పట్టారు. చెత్త షాట్లు ఆడుతూ వికెట్లు సమర్పించుకుంటున్నారు. తాజాగా గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ అదే జరిగింది. టాపార్డర్ బ్యాటర్లు జైస్వాల్, గిల్, విరాట్ కోహ్లీ పేలవ షాట్లతో పెవిలియన్ చేరారు.
పదేపదే అలాంటి షాట్లు ఎంచుకొని కొందరు ప్లేయర్లు వికెట్లు పారేసుకుంటుంటే జట్టులో బ్యాటింగ్ కోచ్ పాత్ర ఏంటని? ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో 'టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ ఎవరు?' అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి అసలు భారత క్రికెట్ జట్టు కోచ్ ఎవరో మీకైనా తెలుసా?
కోచింగ్ స్టాఫ్ ఇదే!
2024 టీ20 వరల్డ్‌కప్ తర్వాత మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. అతడికి అసిస్టెంట్ కోచ్‌లుగా రియాన్ టెన్ డెష్కటే, అభిషేక్ నాయర్ ఎంపికయ్యారు. ఇక జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఉన్న పరాస్ మాంబ్రే స్థానాన్ని సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ మోర్నీ మోర్కెల్‌తో భర్తీ చేశారు. ప్రస్తుతం మోర్నీ మోర్కెల్ భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు.
ఇదీ టీమ్ఇండియా కోచింగ్ స్టాఫ్. ఇందులో రియాన్ టెన్ డెష్కటే, అభిషేక్ నాయర్ హెడ్ కోచ్ గంభీర్‌కు అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు. కానీ, జట్టుకు బ్యాటింగ్ కోచ్ ఎవరో తెలియకపోవడం ఆశ్చర్యకరం! అంటే హెడ్ కోచ్ గంభీర్ ఆధ్వర్యంలో టీమ్ఇండియాకు బ్యాటింగ్ కోచ్ లేడనే చెప్పాలి!
తాజాగా ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ లేవనెత్తాడు. గబ్బా టెస్టులో గంట వ్యవధిలోపే టీమ్ఇండియా టాపార్డర్ కుప్పుకూలడం వల్ల మంజ్రేకర్ భారత కోచింగ్ స్టాఫ్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు. టీమ్ఇండియాలో బ్యాటింగ్ కోచ్ పాత్రను పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు.
It's a joke.but who's the batting coach..?
— Cricket 24x7 (@SIRMRCRICKET) December 16, 2024
'టీమ్ఇండియాలో బ్యాటింగ్ కోచ్ పాత్రను పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందని నేను అనుకుంటున్నాను. జట్టులో కొంతమంది బ్యాటర్లతో ఉన్న సమస్యలకు చాలా కాలంగా ఎందుకు పరిష్కారం దొరకడం లేదు?' అని ట్వీట్లో మంజ్రేకర్ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. 'నిజమే, ప్రస్తుతం టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ ఎవరు?' అని కొందరు అంటుండగా, 'విరాట్, రోహిత్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లకు బ్యాటింగ్ కోచ్ అవసరం లేదు' అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Bhai Manjrekar
— Sports Fever (@sports_fever24) December 16, 2024
I don't think Kohli needs a batting coach at this level.
His issue is known to everyone
This similar fashion he falling
Kyu Rahul Dravid thik nehi kar paye
Who is the batting coach? I believe Abhishek and RTD are assistant coaches not specialist batting coach.
— rᥲȷі𝗍🇮🇳 (@imrajitd) December 16, 2024
Absolutely it's a big question who is guiding the players
— Anuj (@Anuj_utkala) December 16, 2024
టోర్నీ గెలుస్తానని రోహిత్ మాటిచ్చాడు- అదే నా గురుదక్షిణ!: కోచ్
'టీమ్ఇండియాతో పాంటింగ్‌కు ఏం సంబంధం? ఎవరి పని వాళ్లు చూసుకుంటే బెటర్!'