Wasim Akram On Abdullah Shafiq: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ తమ దేశ యంగ్ ప్లేయర్ అబ్దుల్లా షఫిక్‌కు చురకలు అంటించాడు. అతడు క్రికెట్‌ను వదిలి టీవీ నటుడుగా పనిచేసుకుంటే బాగుంటుందని అక్రమ్ అన్నాడు. అయితే పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ 2024లో లాహోర్- ఇస్లామాబాద్ మ్యాచ్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షఫిక్ ఓ క్యాచ్ అందుకున్నాడు. అంతే ఇక తనను ట్రోల్ చేసే వారందరూ అందరూ నిశబ్దంగా ఉండాలి అనే విధంగా 'పెదాలపై వేలు వేసుకుంటూ' సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే షఫిక్ అందుకున్న క్యాచ్ అద్భుతమైనదేనని ఒప్పుకున్న అక్రమ్, కానీ ఆ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు.
'షఫిక్ అందుకున్న క్యాచ్ గొప్పది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఆస్ట్రేలియా పర్యటనలో అతడు 36 క్యాచ్‌లు నేలపాలుచేశాడు. మరి దాని సంగతేంటి? ప్రజలు అతడిపై చేస్తున్న విమర్శలు మానేసి మౌనంగా ఉండాలంటున్నాడు. అందుకే క్రికెట్ మానేసి డ్రామాల్లో నటించమని అతడికి చెప్పండి' అని అక్రమ్ ఓ స్పోర్ట్స్ ఛానెల్ డిబెట్లో అన్నాడు.
అయితే ఫామ్‌లేమి కారణంగా షఫీక్ లాహోర్ జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో సబ్సిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చాడు. ఈ సీజన్లో అతడి ప్రదర్శన అంత చెప్పుకోదగ్గ విధంగా కూడా లేదు. షఫిక్ ప్రస్తుత టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లో కలిపి చేసింది 45 పరుగులే. దీంతో అక్రమ్ చెప్పినట్లు షఫిక్ డ్రామాల్లో నటించడమే బెటర్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇక ఇటీవల పాకిస్థాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడగా పాక్ అన్నింట్లోనూ ఘోరంగా ఓడింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆసీస్ 3-0తో సిరీస్ నెగ్గింది.
ఇక పీఎస్ఎల్ విషయానికొస్తే, సీజన్ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. ప్రస్తుత టోర్నీలో ఇంకా 6 లీగ్ మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ముల్తాన్ సుల్తాన్ 12 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉండగా, లహోర్ 3 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఇక మార్చి 18న ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
48 ఏళ్ల వయసులో షోయబ్‌కు ప్రమోషన్- ఆడబిడ్డకు జన్మనిచ్చిన అక్తర్ భార్య