Virender Sehwag VS Rohit Sharma : టీమ్ఇండియా క్రికెట్ టీమ్‌లో ఇప్పటివరకూ ఆడిన ప్లేయర్లలో రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ తమ తమ టీమ్స్‌లో అత్యుత్తమ ప్లేయర్స్. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా సెహ్వాగ్ క్రీజులోకి దిగాడంటే, ఇక పెద్ద పెద్ద బౌలర్లు కూడా బెంబేలెత్తిపోతారు. దూకుడైన షాట్లతో అద్భుతాలు చేయడం సెహ్వాగ్ స్పెషాలిటీ. అందుకారణంగా అతడు తను తనతో పాటు ఆ సమయంలో ఆడిన ప్లేయర్లలో మేటిగా నిలిచాడు. క్రికెట్ ప్రపంచాన్ని శాసించి అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే ఇప్పటికాలంలో అంతటి దూకుడుగా ఆడి జట్టుకు ఎన్నో అత్యద్భుమైన ఇన్నింగ్స్‌ను అందించిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అందరికీ ఠక్కున రోహిత్ శర్మ పేరు గుర్తొస్తుంది. ఇతడు కూడా ఓపెనర్‌గా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. మిచెల్ స్టార్క్, టిమ్ సౌథీ, జేమ్స్ అండర్సన్ వంటి పవర్ఫుల్ బౌలర్లను తన బ్యాటింగ్ స్కిల్క్తో చిత్తు చేశాడు. బాల్‌ను బౌండరీ దాటించి హిట్‌మ్యాన్‌గా పేరందాడు. అయితే ఈ ఇద్దరూ దూకుడైన ఓపెనర్లే అయినప్పటికీ, ఇద్దరి మధ్యలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి అవేంటంటే :
వీరేంద్ర సెహ్వగ్ ఇప్పటివరకూ టీమ్ఇండియా తరఫున 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 16,119 పరుగులు చేశాడు. అతడి సగటు 41.54 అయితే, అతడి స్ట్రైక్ రేట్ 93.0. ఇక తన కెరీర్లో 36 సెంచరీలు 67 అర్ధ సెంచరీలు చేశాడు మరియు అతని అత్యధిక స్కోరు 319. సెహ్వాగ్ 2245 ఫోర్లు, 227 సిక్సర్లు కొట్టాడు.
రోహిత్ ఇప్పటి వరకు 354 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 15,138 పరుగులు చేశాడు. అతడి సగటు 46.57 కాగా, స్ట్రైక్ రేట్ 93.46. ఇందులో 43 సెంచరీలు ఉండగా, 78 అర్ధ సెంచరీలు కూడా ఉండటం విశేషం. అతని అత్యధిక స్కోరు 264 కాగా, తన కెరీర్లో రోహిత్ 1522 ఫోర్లు, 539 సిక్సర్లు కొట్టాడు.
ఇప్పుడీ ఈ గణాంకాలను చూస్తుంటే వీరేంద్ర సెహ్వాగ్‌తో పోలిస్తే రోహిత్ శర్మ చాలా విషయాల్లో ముందంజలో ఉన్నాడు. అంతేకాకుండా రోహిత్ క్రికెట్ కెరీర్‌ను ఇంకో నాలుగేళ్లు కొనసాగించినా కూడా తన గణాంకాలను మరింత మెరుగుపరుచుకోవడానికి అతడి వద్ద ఉందని క్రికెట్ విశ్లేషకుల మాట.
క్రికెటర్ నుంచి బ్యాంకర్‌గా మారిన సెహ్వాగ్ టీమ్‌మేట్ ఎవరంటే? - Virender Sehwag Cricket Friend