Virat Kohli World Cup 2024: 2024 టీ 20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా కీలక సమరానికి సిద్ధమైంది. 2022లో పొట్టి ప్రపంచకప్ సెమీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్ సేన పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. అయితే ప్రస్తుత టోర్నీలో టీమ్ఇండియా టాపార్డర్‌లో ఏదో మ్యాచ్‌లో ఎవరో ఒకరు బ్యాటర్ అదరగొడుతున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ ఇప్పటివరకు కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఆకట్టుకున్నారు. ఇక మిగిలింది, భారత అభిమానులకు బాకీ పడింది కోహ్లీ ఒక్కడే.
దీంతో గురువారంనాటి మ్యాచ్‌లో అందరి దృష్టి విరాట్ పైనే ఉండనుంది. కీలకమైన ఈ సెమీస్ సమరంలోనైనా విరాట్ జూలు విదిల్చి భారీ స్కోరు సాధించాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే కీలకమైన మ్యాచ్ అనగానే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెచ్చిపోతాడు. గతంలో ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అనేకసార్లు టీమ్ఇండియాను ఆదుకున్నాడు. గత నాలుగు ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో అర్ధ శతకాలతో సత్తా చాటిన కోహ్లీ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. నాకౌట్ మ్యాచ్ అంటే తనలోని అత్యుత్తమ ఆటగాడిని బయటకు తీసుకొచ్చే కింగ్ మరోసారి విధ్వంసం సృష్టించి క్రికెట్ మైదానంలో తానే రారాజునని నిరూపించుకుంటాడేమో చూడాలి.
ఐసీసీ ఈవెంట్లలో నాకౌట్ దశలో విరాట్ కోహ్లీ జూలు విదిలిస్తాడు. అప్పటివరకూ ఉన్న ఆటతీరు గేరు మార్చి టాప్ గేర్‌లోకి వెళ్లిపోతాడు. గత నాలుగు ప్రపంచకప్ సెమీస్‌లలో అర్ధ శతకాలు చేసి విరాట్ కోహ్లీ నాకౌట్ మ్యాచ్‌లలో తాను ఎంతటి విలువైన ఆటగాడినో ఇప్పటికే చెప్పేశాడు. 2014లో జరిగిన టీ 20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకంతో అజేయంగా నిలిచిన కోహ్లీ భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు.
ఆ మ్యాచ్‌లో కేవలం 44 బంతుల్లోనే 72 పరుగులు చేసిన కింగ్ మరో అయిదు బంతులు ఉండగానే భారత జట్టును గెలిపించి ఫైనల్‌కు చేర్చాడు. అదే ఏడాది శ్రీలంకతో జరిగిన ఫైనల్లోనూ కింగ్ 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అందరూ విఫలమైనా 77 పరుగులతో టీమ్ఇండియాను కోహ్లీ ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ పోరాటంతో భారత జట్టు 130 పరుగులు చేయగా దీనిని ఛేదించిన లంక టీ 20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
2016లో వెస్టిండీస్‌తో జరిగిన సెమీస్‌లోనూ కింగ్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ కేవలం 47 బంతుల్లో 89 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో భారత జట్టు 196 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ టార్గెట్‌ను విండీస్ చివరి ఓవర్‌లో ఛేదించి ఫైనల్‌కు చేరింది. ఇక గత ప్రపంచకప్ (2022)లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లోనూ విరాట్ అర్ధ శతకం చేసినా టీమ్ఇండియా ఓడింది.
అయితే ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ వరుసగా విఫలమవుతున్నాడు. దిగ్గజ ఆటగాడి వరుస వైఫల్యాలు జట్టుకు భారంగా మారుతున్నాయి. దీంతో కోహ్లీ తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చేసింది. అది కీలకమైన సెమీస్‌లో నిరూపించుకుంటే ఆ కిక్కే వేరేగా ఉంటుంది. ఇప్పటివరకూ ఈ వరల్డ్‌కప్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కేవలం 65 పరుగులే చేశాడు. అందులోనూ రెండు సార్లు డకౌట్ అయ్యాడు. కానీ ఇప్పుడు విరాట్ అసలు సమయంలో బౌలర్లను వేటాడాల్సిన సమయం వచ్చేసింది. కళ్ల ముందున్న సెమీఫైనల్లో జూలు విదిల్చి ఈ సింహం వేటాడితే అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది?
THE KING looks ready to serve a sweet revenge! 👑💥
— Star Sports (@StarSportsIndia) June 27, 2024
Hit 💙 to cheer him on, as Team India takes on England, today at 6 PM in semi-final 2!
Don't miss #SemiFinal2 👉 #INDvENG | TODAY, 6 PM | #T20WorldCupOnStar pic.twitter.com/FJw6CZzH0n
రోహిత్, బట్లర్ కో ఇన్సిడెంట్- సెమీస్‌కు ముందు ఇంట్రెస్టింగ్ పాయింట్
అఫ్గాన్ ఇంటికి- దక్షిణాఫ్రికా ఫైనల్‌కు - T20 Worldcup 2024 Semifinal