Virat Kohli T20 World Cup : మరి కొద్దిరోజుల్లో జరగనున్న టీ 20 వరల్డ్ కప్ 2024కు అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను చేరువ కావాలనే లక్ష్యంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2024 ప్రపంచ టీ20 కప్‌కు వెస్టిండీస్‌తో కలిసి ఆతిథ్యమిస్తూ తొలిసారి ఇందులో భాగస్వామ్యం కానుంది. జూన్ 1 నుంచి జూన్ 29 వరకూ జరిగే ఈ టోర్నమెంట్‌లో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కూడా చూడొచ్చు. షెడ్యూల్ ప్రకారం న్యూయార్క్‌లో జూన్ 9న ఈ మ్యాచ్ జరగనుంది.
అయితే ఈ టోర్నమెంట్‌లో కీలక పాత్ర పోషించనున్న టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. తానెప్పుడూ అమెరికా వేదికగా క్రికెట్ ఆడతామని ఊహించలేదు అని అన్నాడు.
"నిజం చెప్పాలంటే, యునైటెడ్ స్టేట్స్‌లో అసలు క్రికెట్ ఆడతామనే ఊహించలేదు. కానీ, అది ఇప్పుడు జరగనుంది. క్రీడలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయనడానికి ఇదే ఉదాహరణ. యునైటెడ్ స్టేట్స్ కూడా జరుగుతున్న మార్పును స్వీకరించి వరల్డ్ కప్ ఈవెంట్‌తో క్రికెట్‌ను స్వాగతిస్తోంది. ఇదొక శుభారంభమని ఆశిస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఎక్కువ ప్రభావం కనబరిచి సుదీర్ఘ కాలం గుర్తుండిపోయేలా ఉంటుంది. క్రికెట్ ఆడటమైనా, చూడటమైనా ఎలా ఫీల్ అవుతామో చాలా మందికి తెలుసు. ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్‌కు ఒక జట్టు కూడా రెడీ అయింది. ఇదంతా శుభ పరిణామమే" అని కోహ్లీ పేర్కొన్నాడు.
ప్రపంచకప్‌నకు ఆతిథ్యమివ్వనున్న యునైటెడ్ స్టేట్స్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 1న డల్లాస్ వేదికగా కెనడాతో తలపడనుంది. ఈ రెండు టీమ్‌లతో పాటుగా భారత్ కూడా గ్రూపు ఏ లో కొనసాగుతుంది. గ్రూపు-ఏ లో జట్లు తలపడే మ్యాచ్‌లన్నింటికీ అమెరికానే ఆతిథ్యమివ్వనుంది. నాలుగు గ్రూపులుగా విభజించిన జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రూపు ఏ : భారత్, ఐర్లాండ్, కెనడా, పాకిస్థాన్, అమెరికా
గ్రూప్ బీ : ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్
గ్రూప్ సీ : ఆఫ్గానిస్తాన్, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, ఉగాండా, వెస్టిండీస్
గ్రూప్ డీ : బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక
ఈ టోర్నమెంట్‌లో టీమ్ఇండియాతన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడుతుంది. తర్వాత జూన్ 9న పాకిస్థాన్‌తో ఆడుతుంది.
వరల్డ్ కప్ - తొలి మ్యాచ్‌కు భారీ అడ్డంకి! - T20 World Cup 2024
ఆ స్టార్ క్రికెటర్‌కు హిట్‌మ్యాన్ సూచనలు - హార్దిక్ ప్లేస్‌లో ఛాన్స్! - T20 World Cup 2024