Virat Kohli ICC Award : టీమ్‌ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను సాధించాడు. 2023వ ఏడాదికి గానూ 'ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డును గెలుచుకున్నాడు. దాంతో పాటు 'ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023' క్యాప్‌ను కూడా ఇదే వేదికగా స్వీకరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
2023లో తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. కొన్నేళ్ల పాటు ఫామ్ కోల్పోయిన ఈ రన్నింగ్ మెషిన్, పలు మ్యాచుల్లో మంచి స్కోర్ చేయడానికి నానా తంటాలు పడ్డాడు. అయితే 2023లో అత్యుత్తమ ఫామ్ చూపించి సత్తా చాటాడా. 27 వన్డేల్లో 1337 పరుగులు సాధించాడు. అందులో 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. ఇక అతడి బెస్ట్ స్కోరు 166గా నమోదైంది.
మరోవైపు 2023 ఆసియా కప్‌లోనూ కీలక పాత్ర పోషించాడు. సూపర్ ఫోర్ స్టేజ్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 94 బంతుల్లో 122 పరుగులు చేసి రికార్డు సాధించాడు. అంతేకాకుండా గతేడాది సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్‌లోనూ 11 మ్యాచుల్లో 765 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, ఆరు హఫ్ సెంచరీలు ఉండగా, అతని బెస్ట్ స్కోర్ 117.
ఆ టోర్నమెంట్‌ను టాప్ స్కోరర్‌గా ముగించిన విరాట్, అదే వరల్డ్ కప్ ఎడిషన్‌లో సచిన్ నమోదు చేసిన 673 పరుగులను బీట్ చేశాడు. 2003 వరల్డ్ కప్ టోర్నీలో సచిన్ సాధించిన 49 వన్డే సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు. రీసెంట్గా ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ 15 మ్యాచ్‌లు 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా, ప్రస్తతం విరాట్ ఫామ్ టీమ్ఇండియాను ఊరిస్తోంది. వెస్టిండీస్, యూఎస్ఏలు వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు విరాట్ కూడా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ఈవెంట్‌లో జరగనున్న తొలి మ్యాచ్‌కు విరాట్ ఓపెనర్‌గా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2024 వరల్డ్‌కప్: విరాట్, గేల్ రికార్డులు బద్దలయ్యే ఛాన్స్! - T20 World Cup 2024
అమెరికాలో క్రికెట్ ఆడతామని ఊహించలేదు : విరాట్ కోహ్లీ - T20 World Cup 2024