Virat Kohli Fan RCB : క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌తో కొన్ని సార్లు అభిమానులు తమ ఫేవరట్ స్టార్స్‌ను నేరుగా చూసేందుకు స్టేడియంకు వెళ్తుంటారు. అక్కడ స్టాండ్స్‌లో నిలబడి వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఉప్పొంగిపోతుంటారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఒళ్లు మరిచిపోయి ప్రవర్తించి ఆ ప్లేయర్ల దగ్గరికి వెళ్తుంటారు. మైదనంలోకి వెళ్లిపోయి వాళ్ల కాళ్ల పైన పడటం, కౌగిలించుకోవడం లాంటివి చేస్తుంటారు. ఇటీవలే అలాంటి ఓ ఘటన జరిగింది. అది జరిగిన కొద్ది క్షణాలకే వైరల్ కావడం వల్ల ఆ వీడియో ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది.
చిన్నస్వామి స్టేడియంలో ఇటీవలే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమాని ఒకరు సెక్యూరిటినీ దాటుకుని అకస్మాత్తుగా క్రీజులోకి వచ్చేశాడు. తన అభిమాన క్రికెటర్‌ను చూసిన ఆనందంలో విరాట్ కాళ్ల మీద పడిపోయాడు. అయితే ఆ ఫ్యాన్స్ చేసిన పనికి షాక్ అయిన కోహ్లీ అతడిని లేపేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే సెక్యూరిటీ అక్కడికి చేరుకుని ఆ అభిమానిని పట్టుకున్నారు. అయినాప్పటికీ ఆ వ్యక్తి కోహ్లీని కౌగిలించుకున్నాడు. దీంతో సిబ్బంది ఆ ఫ్యాన్స్‌ను బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు.
ఇలాంటి ఘటనలు క్రికెట్ హిస్టరీలో చాలానే జరిగాయి కదా ఇందులో ఏముందని అనుకుంటే మీరు పొరబడినట్లే. ఈ సారి మాత్రం సెక్యూరిటీ సిబ్బంది తమ దూకుడును చూపించారు. ఆ వ్యక్తిని బయటికి ఈడ్చుకెళ్లిన తర్వాత చితక్కొట్టారు. కాళ్లతో తన్నడం కూడా చేశారు. ఆ తర్వాత అతడ్ని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదంతా చూసిన అభిమానులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఒ అభిమాని చేసిన పనికి ఇలా చిత్కకొట్టాలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది చేసింది సరైనదని కాదంటూ కామెంట్లు పెడుతున్నారు.
-
The fan who obstructed the field to meet Virat Kohli was beaten up black and blue.
— Sameer Allana (@HitmanCricket) March 27, 2024
Thoughts?pic.twitter.com/BZ4SKI6f5d
గతంలోనూ కొంత మంది ఫ్యాన్స్ సెక్యురిటీని దాటుకుని స్టేడియంలోకి ప్రవేశించారు. విరాట్‌ను హగ్ చేసుకునేందుకు ప్రయత్నించారు. గతేడాది నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో 'ఫ్రీ పాలస్తీనా' అని రాసి ఉన్న టీ షర్టు ధరించిన వ్యక్తి మైదానంలోకి వచ్చాడు. అయితే సిబ్బంది అప్రమత్తమై అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
విరాట్, రోహిత్‌కు కొలిసొచ్చిన హోం గ్రౌండ్స్- ఈ వేదికల్లో దబిడి దిబిడే
'టీ20 వరల్డ్‌కప్ జట్టులో విరాట్ ఉండాల్సిందే'- జై షాతో రోహిత్