ETV Bharat / sports

విరాట్ కటౌట్​కు మొక్కిన క్రికెటర్- పీక్స్​లో కోహ్లీ క్రేజ్ - విరాట్​ కోహ్లీ కటౌట్​

Virat Kohli Cutout: టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీపై ఉన్న అభిమాన్ని ఓ ఫ్యాన్ వినూత్న రీతిలో ప్రదర్శించాడు. విరాట్ కటౌట్​కు దండం పెడుతూ అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Virat Kohli Cutout
Virat Kohli Cutout
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 7:59 PM IST

Virat Kohli Cutout : టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్​ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అద్భుతమైన ఆట తీరుతో కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. 2008లో అరంగేట్రం చేసిన తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసూకోకుండా దాదాపు 15ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్​లో అనేక రికార్డులు నెలకొల్పాడు. దీంతో అనేక మంది జూనియర్ ఆటగాళ్లకు సైతం విరాట్ రోల్ మోడల్​గా మారాడు. వాళ్లంతా క్రికెట్​లో అరంగేట్రం చేసి కోహ్లీలాగా రాణించాలనుకుంటారు. తాజాగా ఓ జూనియర్ క్రికెటర్ విరాట్ పట్ల వినూత్నంగా అభిమానం చాటుకున్నాడు.

మధ్యప్రదేశ్​లో ముగదర ప్రాతంలో ఓ అసోసియేషన్​ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో, గ్రౌండ్​ బయట విరాట్ కటౌట్​ ఏర్పాటు చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ జూనియర్ క్రికెటర్ బయట ఉన్న విరాట్ కటౌట్​కు మొక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో 'కోహ్లీ అందరికీ స్ఫూర్తి', 'విరాట్ గ్రేట్ క్రికెటర్' అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక రీసెంట్​గా భారత్​- ఇంగ్లాండ్​ మధ్య జరిగిన మొదటి టెస్ట్‌ తొలి రోజు విరాట్‌ అభిమాని గ్రౌండ్​లోకి దూసుకొచ్చి రోహిత్‌ శర్మ కాళ్లు మొక్కాడు.

తొలి రెండు టెస్ట్​లకు దూరం: విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్​తో జరిగిన తొలి రెండు టెస్ట్​లకు దూరమయ్యాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ నెగ్గగా, విశాఖలో జరిగిమ మ్యాచ్​లో భారత్ గెలుపొందింది. దీంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో రెండు మ్యాచ్​లు ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో నిలిచాయి. ఇక రాజ్​కోట్​ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ప్రారంభం కానుంది. మిగిలిన సిరీస్​కు టీమ్ఇండియా జట్టును ఇంకా ఎంపికచేయాల్సి ఉంది. ఇకపై జరిగే మూడు మ్యాచ్​లకు విరాట్ అందుబాటులో ఉంటాడా? లేదా అన్నాది క్లారిటీ రావాల్సి ఉంది.

రెండో సారి తండ్రిగా ప్రమోషన్!: విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వనుంది! అందుకే ఆమెతో గడపాలని కోహ్లీ - బీసీసీఐ పర్మిషన్​తో తొలి రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడని వార్తలు వస్తున్నాయి. అయితే కోహ్లీ తండ్రి కాబోతున్న విషయం రీసెంట్​గా సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తెలిపాడు.

మూడో టెస్ట్​కు కోహ్లీ - రాహుల్ ద్రవిడ్​​ ఇలా అన్నాడేంటి?

ఐసీసీ ర్యాంకింగ్స్​ రిలీజ్​ - కేన్ మామనే టాప్​ - రోహిత్, కోహ్లీ పొజిషన్ ఏంటంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.