Virat Kohli Records : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్లో మరో అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఇప్పటివరకు విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి స్వదేశంలో 12 వేల పరుగులు పూర్తి చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కంటే ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఒక్కడే ఉన్నాడు.
కింగ్ అదుర్స్
భారత జట్టు తరఫున స్వదేశంలో 219 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 58.84 సగటుతో కోహ్లీ 12,008 పరుగులు చేశాడు. ఇందులో 38 సెంచరీలు, 59 అర్ధ శతకాలు ఉన్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ స్వదేశంలో 258 మ్యాచ్ ల్లో 50.32 సగటుతో 14,192 పరుగులు చేశాడు. ఇందులో 42 సెంచరీలు, 70 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా, విరాట్ స్వదేశంలో మరో 2 వేల పరుగులు బాదితే సచిన్ రికార్డును అధిగమించవచ్చు.
స్వదేశంలో అత్యధిక పరుగులు బాదిన భారత బ్యాటర్లు
ప్లేయర్ | కెరీర్ | మ్యాచ్‌లు | పరుగులు | సెంచరీలు |
సచిన్ తెందూల్కర్ | 1990 - 2013 | 258 | 14192 | 42 |
విరాట్ కోహ్లీ | 2008 - 2024* | 219 | 12004 | 38 |
రాహుల్ ద్రవిడ్ | 1996 - 2011 | 167 | 9004 | 21 |
రోహిత్ శర్మ | 2007 - 2024* | 179 | 8690 | 27 |
వీరేంద్ర సెహ్వాగ్ | 1999 - 2013 | 142 | 7691 | 18 |
ఎమ్ఎస్ ధోనీ | 2005 - 2019 | 202 | 7401 | 12 |
సచిన్ క్రికెట్‌కు దశాబ్దం కిందటే రిటైర్మెంట్ పలకగా, కింగ్ కోహ్లీ ఇటీవల టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. కోహ్లీ మరి కొన్నేళ్లు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగితే స్వదేశంలో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డు బద్దలవ్వడం ఖాయం. అయితే ప్రస్తుతం ఆడుతున్న భారత ప్లేయర్లలో మాత్రం ఈ జాబితాలో విరాట్‌దే అగ్రస్థానం. కెప్టెన్ రోహిత్ శర్మ 8690 పరుగులతో రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా రోహిత్ 4వ ప్లేస్‌లో ఉన్నాడు.
King Kohli’s castle just got mightier with another milestone! 👑🏠
— Royal Challengers Bengaluru (@RCBTweets) September 20, 2024
VK has now amassed 1️⃣2️⃣,0️⃣0️⃣0️⃣ runs at home, crafting epic tales one inning at a time. ❤️🔥#PlayBold #INDvBAN #TeamIndia pic.twitter.com/lnyiGyAPgr
ఇక బంగ్లాతో మ్యాచ్ విషయానికొస్తే, తొలి టెస్టు రెెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విరాట్ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే ఔట్ అయిన విరాట్, రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగుల వద్ద హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే మిరాజ్ వేసిన ఆ బంతి బ్యాట్‌ను తాకినట్లు రీప్లేలో కనిపిస్తోంది. కానీ, విరాట్ రివ్యూ కోరకుండా పెవిలియన్ వైపు వెళ్లాడు.
ప్రాక్టీస్ సెషన్లోనూ విరాట్ మార్క్- కొడితే గోడ బద్దలైంది! - Virat Kohli Practice Session