ETV Bharat / sports

ప్రాక్టీస్ సెషన్​లోనూ విరాట్ మార్క్- కొడితే గోడ బద్దలైంది! - Virat Kohli Practice Session

Virat Kohli Practice Session : బంగ్లాదేశ్​తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమ్ఇండియా ప్లేయర్లంతా నెట్స్​లో దిగి ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. ఈ క్రమంలో విరాట్ ప్రాక్టీస్​కు సంబంధించి వీడియో వైరల్​గా మారింది.

Virat Practice Session
Virat Practice Session (Source: Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 15, 2024, 10:27 PM IST

Virat Kohli Practice Session : కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో బంగ్లాదేశ్​తో టెస్టు సిరీస్​కు టీమ్ఇండియా సిద్ధమౌతోంది. ఈ సిరీస్​లో బంగ్లాదేశ్​తో భారత్ రెండు టెస్టు మ్యాచ్​లు ఆడనుంది. ఇక సెప్టెంబర్ 19న చెన్నై వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ప్లేయర్లంతా చెన్నై చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. ఈ క్రమంలోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా నెట్స్​లో చమటోడుస్తున్నాడు.

అయితే ప్రాక్టీస్​లోనూ విరాట్ తన మార్క్ చూపించాడు. ప్రాక్టీస్​లో భాగంగా ఆదివారం విరాట్ బాదిన ఓ షాట్​కు చెపాక్ స్టేడియంలోని గోడ (Wall) బద్దలైంది. విరాట్ భారీ షాట్​లు ప్రాక్టీస్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. సిరీస్ బ్రాడ్​కాస్టర్ జియో సినిమా ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో షెర్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. 'బంగ్లాతో టెస్టుకు కింగ్ రెడీ అవుతున్నాడు','కోహ్లీ ఆన్ ఫైర్' అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

అరుదైన రికార్డుకు చేరువలో
ఈ సిరీస్​లో విరాట్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకునే ఛాన్స్ ఉంది. 35 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అంతర్జాతీయంగా 591 ఇన్నింగ్స్​ల్లో 26942 పరుగులు చేశాడు. 27 వేల పరుగుల మైలురాయి అందుకునేందుకు విరాట్ మరో 58 రన్స్​ దూరంలో ఉన్నాడు. ఈ క్రమంలో రానున్న బంగ్లా టెస్టు సిరీస్​లో విరాట్ ఫీట్ సాధిస్తే, అంతర్జాతీయ క్రికెట్​లో అత్యంత వేగంగా 27వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్​గా నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ (623 ఇన్నింగ్స్​) పేరిట ఉంది.

నాలుగో ప్లేయర్​గా రికార్డు
విరాట్ ఈ ఫీట్ అందుకుంటే, ఇంటర్నేషనల్ క్రికెట్​లో 27 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాటర్​గా నిలుస్తాడు. ఈ లిస్ట్​లో సచిన్ తెందూల్కర్ (34357) టాప్​లో ఉండగా కుమార సంగక్కర, రికీ పాంటింగ్​ వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు.

ఆ రికార్డుకూ చేరువలో
కాగా, టెస్టుల్లో విరాట్ 9 వేల పరుగుల మైలురాయి అందుకునేందుకు 152 రన్స్ కావాలి. ఈ ఫీట్ అందుకోవడం కూడా లాంఛనమే. దీంతో సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్​లో 9 వేల పరుగుల మైలురాయి అందుకున్న నాలుగో భారత బ్యాటర్​గానూ ఘనత సాధిస్తాడు. విరాట్ కంటే ముందు టీమ్ఇండియా నుంచి సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే 9 వేల పరుగులు పూర్తి చేశారు.

ఆల్​టైమ్​ రికార్డ్​పై రోహిత్ కన్ను - టీమ్ఇండియాలో ఒకే ఒక్కడు! - IND vs BAN 2024

టీమ్ఇండియా మాస్టర్ ప్లాన్- బంగ్లాకు ఇక కష్టమే! - Ind vs Ban Series 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.