Virat Kohli Border Gavaskar Trophy : మరికొద్ది రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే బృందాల వారిగా ఆస్ట్రేలియాకు చేరుకున్న టీమ్ఇండియా జట్టు అక్కడి పిచ్‌లపై తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే తాజాగా పెర్త్‌లో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే?
విరాట్, బుమ్రా స్పెషల్ ప్రాక్టీస్!
ఇక ఆస్ట్రేలియాలో టీమ్ఇండియా తమ అఫీషియల్ ట్రైనింగ్ నవంబర్ 12 నుంచి ప్రారంభించింది. గత మ్యాచ్‌ల్లోని లోటుపాట్లను తెలుసుకుని భారత జట్టు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవలె మ్యాచుల్లో పరుగుల కోసం ఇబ్బంది పడ్డ విరాట్, రానున్న పెర్త్ టెస్టు కోసం ఘోరంగా కసరత్తులు చేస్తున్నాడు. ఫాస్ట్ బౌలర్లతో పాటు సుమారు అరగంట పాటు నెట్స్‌లో చెమటోడ్చినట్లు తెలుస్తోంది.
అయితే విరాట్ ప్రాక్టీస్‌లో ఉన్నాడని తెలుసుకున్న కొంతమంది అభిమానులు అతడ్ని చూడాలన్న ఆరాటంతో ఓ విచిత్రమైన పని చేశారు. ఏకంగా నిచ్చెనలు వేసుకుని మరీ చెట్లు ఎక్కి విరాట్‌ను చూసేందుకు పోటీ పడ్డారు. దీంతో అప్రమత్తమైన మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ప్రాంతమంతటిని ఓ నల్లటి క్లాత్‌తో కప్పి ఉంచినట్లు ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది.
First look at Virat Kohli at the Perth nets ahead of the Test series opener 🏏
— Fox Cricket (@FoxCricket) November 14, 2024
Some fans went the extra mile to catch a glimpse of the King 👀#AUSvIND pic.twitter.com/pXDEtDhPeY
సర్ఫరాజ్‌కు గాయం!
ఇదిలా ఉండగా, తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్, బుమ్రాతో పాటు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్ దీప్‌తో పాటు మిగతా టీమ్ఇండియా ప్లేయర్లు కూడా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సర్ఫరాజ్ గాయపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు తన మోచేయి పట్టుకుని నెట్స్ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీపై విరాట్ స్పెషల్ కవరేజ్!
ఇదిలా ఉండగా, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్‌ను ఆస్ట్రేలియా మీడియా పొగడ్తలతో ముంచెత్తుతోంది. వీరిద్దరిని హైలైట్ చేస్తూ అక్కడి వార్తా పత్రికల్లో ప్రత్యేకమైన కథనాలు ప్రచురితమయ్యాడు. ముఖ్యంగా ప్రముఖ న్యూస్ పేపర్ 'ది డైలీ టెలిగ్రాఫ్'లో కోహ్లీ ఫొటోను ఫ్రంట్ కవర్ పేజీపై ప్రచురించింది. దీంతో పాటు అతడు ఏ ఫార్మాట్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడాడు, ఎన్ని పరుగులు చేశాడు. అందులో ఎన్ని సెంచరీలు ఉన్నాయి. అతడి సగటు ఎంత? అనే వివరాలను రాశారు. ఇక అదే వార్తా పత్రిక గతంలో యశస్వి జైస్వాల్ సెంచరీ చేసిన ఫొటోను ప్రచురించి 'కొత్త రాజు' అనే అర్థం వచ్చేలా ఓ హెడ్డింగ్ రాసుకొచ్చింది. దానికి హిందీ, పంజాబీ భాషలోనూ ప్రత్యేకమైన ఫాంట్లను జోడించింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలను క్రీడాభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ ట్రెండ్ చేస్తున్నారు.
భారత్ Vs ఆస్ట్రేలియా - ఈ వివాదాలను ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరుగా!
సీక్రెట్ క్యాంప్‌లో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ - తొలి టెస్టు పిచ్ ఇదే!