ETV Bharat / sports

IPLను ఛాలెంజింగ్​గా తీసుకోనున్న విరాట్- టార్గెట్ అదే- అంత తేలిగ్గా వదలడులే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 1:31 PM IST

Virat Kohli 2024 IPL: భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఆఖరి మెట్టుపై టీమ్ఇండియా బోల్తా పడింది. దీంతో ఐపీఎల్‌ తర్వాత అమెరికా-వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహించే టీ 20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకునేందుకు భారత జట్టు ప్రణాళికలు రచిస్తోంది. మరి ఈ టీ20 వరల్డ్​కప్​ జట్టులో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీకి చోటు దక్కుతుందా? కింగ్‌కు ఉన్న ఆ ఒకే ఒక అవకాశం ఏంటి? దాన్ని విరాట్‌ సద్వినియోగం చేసుకుంటాడా?

virat kohli t20 2024 ipl
virat kohli t20 2024 ipl

Virat Kohli 2024 IPL: 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమిని, టీ 20 వరల్డ్​కప్​ టైటిల్ కైవసం చేసుకుని మరిపించాలని రోహిత్‌ సేన కోరుకుంటోంది. ఈ క్రమంలో 2024 టీ20 వరల్డ్​కప్​లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడా? లేదా అన్నది కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. అయితే 2022 టీ20 ప్రపంచ‌క‌ప్ సెమీ ఫైన‌ల్‌లో భార‌త్​ ఓటమి తర్వాత విరాట్‌ పొట్టి ఫార్మాట్​కు దాదాపు 14 నెలలు బ్రేక్ ఇచ్చాడు. ఇదే ఏడాది అఫ్గానిస్థాన్​తో జరిగిన టీ20 సిరీస్​తో టీ20లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ, అందులో విరాట్ పెద్దగా ఆకట్టుకోలేదు.

అయితే అతడి స్థానంలో మరో ఆటగాడి ఎంపికపై అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ కసరత్తులు చేస్తోందని ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు అభిమానులను కలవరపరుస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే విరాట్‌ పొట్టి ప్రపంచకప్‌లో చోటు దక్కించుకునేందుకు ఓ అవకాశం ఉంది! అదే ఐపీఎల్‌. బెంగళూరు తరపున బరిలోకి దిగుతున్న కోహ్లీ ఈ సీజన్​లో విశ్వరూపం ప్రదర్శిస్తే పొట్టి ప్రపంచకప్‌ జట్టులో విరాట్‌ స్థానం పదిలమే.

అవకాశాన్ని వదులుతాడా: ఐపీఎల్ సీజన్ 17 రాయల్‌ ఛాలెంజర్ బెంగళూరు- చెన్నై సూపర్‌కింగ్స్‌ మ్యాచ్​లో మార్చి 22న ప్రారంభం కానుంది. ఈ క్రమంలో విరాట్ తన వన్డే ఫామ్​ను కొనసాగిస్తే, అతడిని ఆపడం ఎవరి తరమూ కాదు. ఐపీఎల్‌లో మరో ఆరు పరుగులు చేస్తే టీ20 ఫార్మాట్‌లో 12,000 రన్స్‌ చేసిన ఆరో ఆటగాడిగా కోహ్లీ నిలుస్తాడు. టీ20ల్లో ఇంతటి ఘనమైన రికార్డులు ఉన్న కోహ్లీ అంత తేలిగ్గా వరల్డ్​కప్​ అవకాశాన్ని వదులుకుంటాడా? వదలడు! విధ్వంసం సృష్టిస్తాడు.

2022లోనూ అదుర్స్​: ఒకసారి బరిలోకి దిగితే కోహ్లీ చెలరేగిపోతాడు అనటంలో అతిశయోక్తి లేదు. గత టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీఫైనల్లో ఓడిపోయింది. అయినా విరాట్ లీగ్​ దశలో అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా, ఓడిపోతామ‌నుకొన్న పాకిస్థాన్ మ్యాచ్‌లో 53 బాల్స్‌లో 82 ప‌రుగులు చేసి అద్భుత విజ‌యాన్ని అందించాడు. మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో 98.66 యావరేజ్‌తో 296 రన్స్ చేసిన కోహ్లి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో 4,000 పరుగుల ఏకైక క్రికెటర్‌ కోహ్లీ.

ఛేజింగ్​ కింగ్: అంతర్జాతీయ టీ20లో లక్ష్య ఛేదనలో 2000 ప‌రుగులు చేసిన రికార్డ్ విరాట్ పేరిటే ఉంది. టీ 20 క్రికెట్‌ చరిత్రలో ఛేజింగ్‌లో 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ అరుదైన ఘ‌న‌త సాధించిన ఏకైక క్రికెట‌ర్‌గా చ‌రిత్రకెక్కాడు. ఇప్పటివ‌ర‌కు పొట్టి ఫార్మాట్ ఛేజింగ్‌లో కోహ్లి 46 ఇన్నింగ్స్ ఆడి 136.96 స్ట్రైక్‌రేటుతో 2012 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో 20 అర్ధ శ‌త‌కాలు ఉన్నాయి.

ఇక వన్డేల్లోనూ ఛేజింగ్‌లో 152 ఇన్నింగ్స్ ఆడి కోహ్లీ 7794 ర‌న్స్ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 27 సెంచ‌రీలు, న‌ల‌భై అర్ధ శతకాలు ఉన్నాయి. 2023లో కోహ్లీ అంతర్జాతీయ పరుగులు 1500 దాటాయి. ఏడు సెంచరీలు చేశాడు. ప్రపంచకప్, ఆసియా కప్‌లో అభిమానులను ఉర్రూతలూగించాడు. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అదరగొట్టాడు. మూడు శతకాలతో పాటు నాలుగు అర్ధసెంచరీలు చేశాడు. ఈ ఫామ్‌ను చూసినా టీ 20 ప్రపంచకప్‌లో కోహ్లీకి స్థానం ఖాయంగా కనిపిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కింగ్ కోహ్లీ వచ్చేశాడు -కొత్త లుక్​లో IPLకి రెడీ- ఫొటోస్ చూశారా?

IPL ఆరెంజ్ క్యాప్- టాప్​లో వార్నర్- విరాట్, గేల్ ఎన్నిసార్లంటే?​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.