Under - 19 World Cup : అండర్ 19 ప్రపంచ కప్‌లో యంగ్ టీమ్ ఇండియా హ్యాట్రిక్ నమోదు చేసింది. గ్రూప్ స్టేజ్‌లో యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి జట్టుపై 201 పరుగుల భారీ తేడాతో గెలుపును ఖాతాలో వేసుకుంది.
మొదట టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. అర్శిన్ కులకర్ణి(108) సెంచరీతో, ముషీర్ ఖాన్ (73) హాఫ్ సెంచరీతో అదరగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన యూఎస్‌ఏ 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. ఉత్కర్ష్ శ్రీవాత్సవ (40) ఫర్వాలేదనిపించగా, ఆమోఘ్ ఆరేపల్లి (27*), ఆరిన్ నడక్కర్ణి (20) కాస్త పోరాడారు. దీంతో ఓటమి అంతరం కాస్త తగ్గింది. భారత బౌలర్లలో నమన్ తివారీ 4 వికెట్లు తీయగా రాజ్ లంబానీ, ప్రియాంన్షు మొలియా, సౌమీ పాండే, మురుగన్ అభిషేక్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇకపోతే మంగళవారం నుంచి సూపర్ సిక్స్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం : యూఎస్‌ఏ జట్టుపై భారత్ బ్యాటర్లు అదిరే ప్రదర్శన చేశారు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (25)తో అర్షిన్ కులకర్ణి మొదటి వికెట్‌కు 46 పరుగులు నమోదు చేశాడు. ఆదర్శ్ ఔట్ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చాడు ముషీర్ ఖాన్. ఇతడితో కలిసి అర్షిన్ రెండో వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ముషీర్ ఔట్ అయినప్పటికీ కెప్టెన్ ఉదయ్ సహరన్ (35)తో అర్షిన్ మరో 56 పరుగులు జోడిండి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఈ క్రమంలో అర్షిన్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే యూఎస్‌ఏ బౌలర్లు పుంజుకోవడం వల్ల స్వల్ప వ్యవధిలో టీమ్‌ఇండియా వికెట్లను చేజార్చుకుంది. ప్రియాన్షు మోలియా 27, సచిన్ ధాస్ 20, ఆరవెల్లి అవనీశ్ 12* పరుగులు మాత్రమే చేశారు. యూఎస్‌ఏ బౌలర్లు అతీంద్ర సుబ్రమణియన్ 2 వికెట్లు తీయగా ఆరిన్ నడ్కరి, ఆర్య గార్గ్, రిషి రమేశ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
-
India's spirited victory in Bloemfontein helps them finish at the top of Group A 👀#U19WorldCup #INDvUSA pic.twitter.com/sOIl1Eqmp5
— ICC (@ICC) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">India's spirited victory in Bloemfontein helps them finish at the top of Group A 👀#U19WorldCup #INDvUSA pic.twitter.com/sOIl1Eqmp5
— ICC (@ICC) January 28, 2024India's spirited victory in Bloemfontein helps them finish at the top of Group A 👀#U19WorldCup #INDvUSA pic.twitter.com/sOIl1Eqmp5
— ICC (@ICC) January 28, 2024
లంక క్రికెట్ బోర్డుపై నిషేధం ఎత్తివేత
ఉప్పల్ టెస్ట్‌లో భారత్ ఓటమి - 7 వికెట్లతో చెలరేగిన ఇంగ్లాండ్ స్పిన్నర్