ETV Bharat / sports

అండర్‌-19 వరల్డ్ కప్ : వీళ్లలో సీనియర్​ జట్టు తలుపు తట్టేదెవరో? - teamindia under 19

Under 19 World Cup Teamindia Performance : రీసెంట్​గా జరిగిన అండర్‌-19 వరల్డ్ కప్​లో సెమీస్​ వరకు​ అద్భుత ప్రదర్శన చేసిన యంగ్ టీమ్ ఇండియాకు ఆశించిన ముగింపు దక్కలేదు. తుది మెట్టుపై బోల్తా పడ్డారు. అయితే ఈ మెగా టోర్నీలో కొంతమంది టీమ్‌ఇండియా కుర్రాళ్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వీరు సీనియర్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేలా కనిపిస్తున్నారు. వారెవరో చూసేద్దాం..

అండర్‌-19 వరల్డ్ కప్ : వీళ్లలో సీనియర్​ జట్టు తలుపు తట్టేదెవరో?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 8:17 AM IST

Under 19 World Cup Teamindia Performance : అండర్‌ - 19 వరల్డ్​ కప్‌లో యువ భారత్‌ అద్భుత ప్రదర్శనతో సాగినప్పటికీ మంచి ముగింపు దక్కలేదు. ఫైనల్​లో బోల్తా పడి రన్నరప్​గా నిలిచింది. అయితే ఈ మెగాటోర్నీలో కొంతమంది మనోళ్ల కుర్రాళ్ల ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. భారత క్రికెట్‌ భవిష్యత్‌ మెరుగ్గానే ఉందని ఈ ప్లేయర్ల ప్రదర్శన చెబుతోంది. ఈ నేపథ్యంలో అండర్‌-19 నుంచి సీనియర్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేలా ఉన్న ప్లేయర్స్​ ఎవరో ఓ లుక్కేద్దాం.

ఉదయ్‌ సహారన్‌ : అండర్‌-19 ప్రపంచ కప్‌లో కెప్టెన్​గా జట్టును అజేయంగా ఫైనల్‌ చేర్చాడు ఈ కుర్రాడు. క్రికెట్ కోసం రాజస్థాన్‌లోని గంగానగర్‌ నుంచి పంజాబ్‌కు మకాం మర్చాడు. ప్రస్తుతం జరిగిన టోర్నీలో బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీతోనూ అదరగొట్టాడు. జూనియర్‌ మిస్టర్‌ కూల్‌గా పేరు గడించాడు. సెమీస్‌లో అతడు చేసిన 81 పరుగుల ఇన్నింగ్స్‌ జట్టును కాపాడింది. ఈ టోర్నీలో అత్యధిక పరుగుల చేసింది ఇతనే. 7 ఇన్నింగ్స్‌ల్లో 56.71 యావరేజ్​తో 397 పరుగులు చేశారు. ఇందులో ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ముషీర్ ఖాన్ : దేశవాళీల్లో భారీగా పరుగులు చేసి టీమ్‌ఇండియా తరఫున ఆడేందుకు అడుగు దూరంలో ఉన్నాడు సర్ఫరాజ్​. అతడి తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం జరిగిన వరల్డ్​ కప్​లో 7 ఇన్నింగ్స్‌ల్లో 60 యావరేజ్​తో 360 పరుగులు చేశాడు ఈ ముంబయి కుర్రాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్​లో రెండో స్థానంలో నిలిచాడు. ఈ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ రెండు సెంచరీలను ఖాతాలో వేసుకున్నాడు. ఇతను స్పిన్నర్‌ కూడా. ఈ వరల్డ్ కప్​లో అతడు లెఫ్టార్మ్‌ ఆఫ్‌స్పిన్‌తో 7 వికెట్లను తీశాడు.

సచిన్‌ : క్రికెటర్ కావాలని ఆశించిన మహారాష్ట్రకు చెందిన సంజయ్‌ కబడ్డీలో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించాడు. కానీ క్రికెట్‌పై ఉన్న మక్కువతో అకాడమీ పెట్టాడు. కొడుకుకు సచిన్‌ పేరు పెట్టాడు. ఇప్పుడా తండ్రి కలను నిజం చేస్తూ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు సచిన్. ఈ వరల్డ్​ కప్​లో అటాకింగ్‌ ఆటతో, ఫినిషింగ్‌ నైపుణ్యాలతో మంచిగా రాణించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో లక్ష్య ఛేధనలో 32కే నాలుగు వికెట్లు పడ్డాయి. ఆ దశలో 96 పరుగుల ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. 7 ఇన్నింగ్స్‌ల్లో 60.60 యావరేజ్​తో 303 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో ఐదో స్థానం నిలిచాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.

సౌమీ పాండే : పేసర్ల ఆధిపత్యం ఉండే దక్షిణాఫ్రికా బౌన్సీ, పేస్‌ పిచ్‌లపై స్పిన్‌తో సత్తాచాటాడు సౌమీ పాండే. ఈ వరల్డ్ కప్​లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌ (18) అతడే. మొత్తంగా రెండో స్థానంలో నిలిచాడు. లెఫ్మార్మ్‌ ఆఫ్‌స్పిన్‌తో ప్రత్యర్థులను బోల్తా కొట్టించాడు. ఈ మెగా టోర్నీలో అతడి ఎకానమీ రేటు 2.68. ఇంకా పేసర్లు నమన్‌ తివారి (12), రాజ్‌ లింబాని (11) కూడా ఈ మెగా టోర్నీలో మంచిగా రాణించారు.

ఇంకా ఈ వరల్డ్ కప్​లో ఇద్దరు హైదరాబాద్‌ కుర్రాళ్లు కూడా ఆడారు. వారే స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మురుగన్‌ అభిషేక్‌, వికెట్‌ కీపర్‌ ఆరవెల్లి అవనీశ్‌ రావు. వీరు పూర్తిస్థాయిలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారనే చెప్పాలి. అయితే అభిషేక్‌ బాగానే పరుగులు కట్టిడి చేఖాడు. 3.35 ఎకానమీ రేటుతో మూడు వికెట్లు తీశాడు. స్పిన్‌తో పాటు ధనాధన్‌ షాట్లు కూడా బాదాడు. పేసర్లు షార్ట్‌పిచ్‌ బంతులు వేసినా తన భారీ షాట్లతో 42 పరుగులు చేశాడు.

రాజన్న సిరిసిల్లా జిల్లా పోతుగల్‌కు చెందినవాడు ఆరవెల్లి అవనీశ్. ఇక వికెట్ల వెనకాల మెరుగైన ప్రదర్శన చేసిన అవనీశ్‌ బ్యాటింగ్‌లో మాత్రం అంతగా రాణించలేకపోయాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 84 పరుగులే చేశాడు. అతడిని ఇప్పటికే ఐపీఎల్‌ వేలంలో సీఎస్కే దక్కించుకుంది.

ఇషాన్​పై బీసీసీఐ గరం- రంజీల్లో ఆడాల్సిందేనని నోటీసులు!

మూడో టెస్ట్​కు కీలక మార్పులు - భరత్‌ బదులు ధ్రువ్‌- సర్ఫరాజ్​ సంగతేంటంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.