Under 19 World Cup 2024 Australia : ఫిబ్రవరి 11 భారత కుర్రాళ్ల కల చెదిరిన సంగతి తెలిసిందే. అండర్ - 19 వరల్డ్ కప్ చేజారింది. ఆదివారం జరిగిన తుదిపోరులో డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్‌ఇండియాను 79 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు ఓడించింది. అయితే ఆస్ట్రేలియా ఇప్పుడేమి తొలిసారి ఆధిపత్యం చెలాయించలేదు. ప్రపంచ క్రికెట్‌పై కంగారుల జట్టు ఎప్పటినుంచో ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది. ఫార్మాట్లకు అతీతంగా వరుస టైటిల్స్‌ను ఖాతాలో వేసుకుంటూ ప్రపంచ క్రికెట్‌ను శాశిస్తోంది. ఈ మధ్య కాలంలో జరిగిన అన్ని మెగా ఈవెంట్ల ఫైనల్స్‌లోనూ ఆసీస్ విజయాలు సాధిస్తూ దూసుకెళ్లింది.
ఇంకా చెప్పాలంటే ఆస్ట్రేలియా క్రికెట్ హవా కేవలం పురుషుల క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. మహిళ క్రికెట్‌లోనూ డామినేషన్ చేస్తూనే ఉంది. అలా ఇప్పుడు ఆస్ట్రేలియన్లు జూనియర్ విభాగంలోనూ అదరగొట్టారు. అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్లో యువ ఆసీస్ జట్టు యంగ్ ఇండియాను చిత్తుగా ఓడించింది. ఈ అండర్ - 19లో నాలుగోసారి జగజ్జేతగా అవతరించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అలా ఈ అండర్ 19 టైటిల్‌తో ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లోనూ పురుషులు, మహిళలు, జూనియర్ లెవెల్లో వరల్డ్ ఛాంపియన్‌గా(వన్డే ఫార్మాట్‌లో) అవతరించింది.
- వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్ - ఆస్ట్రేలియా
- అండర్ 19 వరల్డ్‌కప్ ఛాంపియన్ - ఆస్ట్రేలియా
- మహిళల వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్ - ఆస్ట్రేలియా
- మహిళల టీ20 ఛాంపియన్ - ఆస్ట్రేలియా
- వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ - ఆస్ట్రేలియా
ఇక అండర్ - 19 వరల్డ్ కప్ 2024 ఫైనల్ విషయానికొస్తే.. యంగ్ ఆస్ట్రేలియా భారత కుర్రాళ్లను 79 పరుగుల తేడాతో ఓటమి రుచిని చూపించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది హర్జాస్ సింగ్ (64 బంతుల్లో 55; 3×4, 3×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ హ్యూ వీబ్జెన్ (48), ఒలీవర్ పీక్ (46 నాటౌట్), హ్యారీ డిక్సన్ (42) కూడా మంచిగా రాణించారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని (3/38), నమన్ తివారి (2/63) అదరగొట్టారు. ఇక ఛేదనలో చేతులెత్తేసిన యంగ్ ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలిపోయింది. ఆదర్శ్ సింగ్ (77 బంతుల్లో 47; 4×4, 1×6), హైదరాబాద్ కుర్రాడు మురుగన్ అభిషేక్ ( 46 బంతుల్లో 42; 5×4, 1×6) తప్ప మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆసీస్ బౌలర్లలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బియర్డ్‌మన్ (3/15), మెక్‌మిలన్ (3/43), విడ్లర్ (2/35) విజృంభించారు. ఈ ఓటమితో భారత క్రికెట్ అభిమానులంతా నిరాశ పడిపోయారు.
-
Moments to cherish forever for Australia's future stars ⭐
— ICC (@ICC) February 11, 2024
More as they claimed the #U19WorldCup trophy 🏆https://t.co/iDgT6nfIdM
సెంచరీలతో మ్యాక్సీ సంచలనం - దెబ్బకు రోహిత్ రికార్డు సమం
మారథాన్ ప్రపంచ విజేత కెల్విన్ మృతి- కారు ప్రమాదంలో కోచ్ సైతం మరణం