virat kohli Abused Journalist : టీమ్ ఇండియా దిగ్గజం విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్‌తోనే కాకుండా వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు. టీమ్ ఇండియా హెచ్ కోచ్ గౌతమ గంభీర్, లఖ్ నవూ బౌలర్ నవీన్ ఉల్ హక్ సహా పలువురితో ఐపీఎల్లో గొడవలు పెట్టుకుని హాట్‌టాపిక్‌గా కూడా నిలిచాడు. అలాగే కోహ్లీ తన కెరీర్లో జర్నలిస్టులు, విదేశీ ప్లేయర్లతోనూ తగాదాలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.
జర్నలిస్టుతో కోహ్లీ గొడవ! - 2015 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, యూఏఈతో గెలిచి టీమ్ ఇండియా మంచి ఊపు మీద ఉంది. అయితే ఈ సమయంలో పెర్త్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు అప్పటి భారత్ టీమ్ కెప్టెన్ కోహ్లీ జర్నలిస్టును దుర్భాషలాడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో పెద్ద వివాదమే చెలరేగింది. బీసీసీఐ, ఐసీసీకి కోహ్లీపై ఫిర్యాదు కూడా అందింది. ఆఖరికి బీసీసీఐ కలగజేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేసింది.
బీసీసీఐ కీలక ప్రకటన! - తనవైపు కోహ్లీ డగౌట్ నుంచి వేలు చూపించాడని, అలాగే దుర్భాషలాడాడని జర్నలిస్ట్ ఫిర్యాదు చేసినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. తాను ఏం రిప్లై ఇవ్వకపోయినప్పటికీ కోహ్లీ కవ్వించినట్లు ఆరోపించిందామె. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బీసీసీఐ ఒక ప్రకటనను సైతం విడుదల చేసింది. "జర్నలిస్ట్ పై టీమ్ ఇండియా దుర్భాషలాడిన వ్యవహారంపై బీసీసీఐ జట్టు మేనేజ్ మెంట్‌తో సంప్రదింపులు జరుపుతోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. క్రికెట్‌ను కవర్ చేయడం, ఆటకు ప్రచారం కల్పించడంలో మీడియా పాత్ర కీలకం. బీసీసీఐ మీడియాను గౌరవిస్తుంది. భారత జట్టు మీడియా పట్ల గౌరవంగా ఉండాలి." అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, భవిష్యత్తులో జర్నలిస్టుపై దుర్భాషలాడొద్దని కోహ్లీని బీసీసీఐ మందలించినట్లు సమాచారం.
జర్నలిస్టులపై కోహ్లీ ఫైర్! - పలు సందర్భాల్లో విరాట్ కోహ్లీ మీడియా విలేకరులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. 2020లో న్యూజిలాండ్ పర్యటనకు భారత్ వెళ్లింది. అప్పుడు ఓ జర్నలిస్టు, మైదానంలో కోహ్లీ దూకుడు, ప్రవర్తనపై ఓ ప్రశ్న అడిగాడు. దీంతో కోహ్లీ అతడిపై మండిపడ్డాడు. మరింత మెరుగైన ప్రశ్నతో ముందుకు రావాలని సూచించాడు.
జాన్సన్‌తోనూ వివాదం హాట్‌టాపిక్ - 2014-15లో ఆస్ట్రేలియాలో ఆడిన బోర్డర్- గావస్కర్ టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ, ఆసీస్ పేసర్ జాన్సన్ గొడవపడ్డాడు. జాన్సన్ విసిరిన త్రో విరాట్‌కు తగిలింది. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. అలాగే ఆసీస్ ప్లేయర్ల స్లెడ్జింగ్ అందుకు ఓ కారణంగా చెప్పొచ్చు. మ్యాచ్ ముగిసిన తర్వాత జాన్సన్‌తో జరిగిన గొడవ గురించి కోహ్లీ మాట్లాడాడు.
"జాన్సన్ నన్ను బంతితో కొట్టడం వల్ల నాకు చాలా కోపం వచ్చింది. స్టంప్‌లను గురి చూసి కొట్టండని, నా శరీరాన్ని కాదని జాన్సన్‌తో చెప్పాను. అలాగే స్లెడ్జింగ్‌కు ఆసీస్ ఆటగాడు పాల్పడ్డాడు. అందుకే అతడిని నేను గౌరవించలేదు. " అని విరాట్ వ్యాఖ్యానించాడు. దీంతో అప్పట్లో ఈ గొడవ తీవ్ర దుమారం రేపింది.
కోహ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ధరించే సన్ గ్లాసెస్ ధర అంతా? - Kohli Oakley sunglasses Price
LED స్టంప్‌లు వెరీ కాస్ట్లీ! ధర ఎంతో తెలుసా? - Cricket LED Stumps Cost