CSK vs GT IPL 2024: 2024 ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి తలపడనున్నాయి. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా శుక్రవారం ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఇదే సీజన్లో చిదంబరం స్టేడియం వేదికగా తలపడిన మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై, నరేంద్ర మోదీ మైదానంలోనూ అదే తరహా ఫలితాన్ని నమోదు చేయాలని తహతహలాడుతోంది. గతేడాది తలపడిన ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. అందులో ఒకటి ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్.
అయితే ఈ జట్లలో ఓ కామన్ పాయిట్ ఉంది. ఈ టీమ్స్‌లో ఆడిన పలువురు ప్లేయర్లు రెండు జట్లు టైటిల్ నెగ్గిన సందర్భాల్లో సభ్యులుగా ఉన్నారు. తుది జట్టులో స్థానం దక్కించుకొని, టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ 5సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అటు గుజరాత్ కూడా ఆడిన రెండు సీజన్లలో ఓసారి టైటిల్ ముద్దాడింది. ఇరు జట్లలో ఉండి టైటిల్ గెలిచేందుకు కారణమైన ముగ్గురు ప్లేయర్ల గురించి తెలుసుకుందాం.
సాయి కిశోర్- ఐపీఎల్ 2021: రెండు టీమ్‌లలో ఉండి వరుసగా రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీ సాధించిన కొద్ది మంది ప్లేయర్లలో సాయి కిశోర్ ఒకడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ 2021లో యూఏఈ వేదికగా ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడాడు. తమిళనాడు డొమెస్టిక్ క్రికెట్‌లో తానేంటో నిరూపించుకున్న సాయి కిశోర్ ఒక్క సారి కూడా బరిలోకి దిగే అవకాశం రాలేదు.
ఓ సంవత్సరం తర్వాత 2022లో గుజరాత్ టైటన్స్ సాయి కిశోర్‌ను వేలంలో రూ.3కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో ఐదు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2022 ఫైనల్లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
డామినిక్ డ్రేక్స్- ఐపీఎల్ 2021: మరో ప్లేయరే ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ డామినిక్ డ్రేక్స్. ఆశ్చర్యకరంగా డ్రేక్స్ గుజరాత్ టైటాన్స్‌కు గానీ చెన్నై సూపర్ కింగ్స్ తరపున గానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాకపోతే రెండు సీజన్లలో టైటిల్ సొంతం చేసుకున్న జట్టులో భాగమయ్యాడు. చెన్నై జట్టులో శామ్ కరన్‌కు రీప్లేస్‌మెంట్‌గా జాయిన్ అయిన డ్రేక్స్ తర్వాతి సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ రూ.1.1 కోట్లకు సొంతం చేసుకుంది. అలా ఐపీఎల్ 2022లో టైటిల్ గెలిచిన గుజరాత్ జట్టులో ఒకడుగా ఉన్నాడు.
వృద్ధిమాన్ సాహా- ఐపీఎల్ 2011: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2011లో రెండో టైటిల్ గెలిచింది. ఆ సీజన్లో ఎంఎస్ ధోనీకి బ్యాకప్ వికెట్ కీపర్‌గా సాహా జట్టులోనే ఉన్నాడు. 2011సీజన్లో ఏడు మ్యాచ్‌ల్లో 68 పరుగులు చేశాడు. పదకొండేళ్ల తర్వాత గుజరాత్ టైటాన్స్‌కు ఆడి మరోసారి ఐపీఎల్ ఛాంపియన్ అయిన జట్టులో భాగమయ్యాడు. 2022వ సీజన్లోే సాహా 317 పరుగులు చేయడం విశేషం.
రికార్డ్ స్థాయిలో IPL వ్యువర్షిప్స్- అప్పుడే 51 కోట్లు క్రాస్! - IPL 2024
12 పరుగులకే ఆలౌట్- T20 హిస్టరీలో రెండో అత్యల్ప స్కోర్ - Lowest Total In T20 History