TeamIndia VS Zimbabwe T20 Series : జులై 6 నుంచి జింబాబ్వే వర్సెస్ ఇండియా టీ20 సిరీస్ మొదలు కానుంది. హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మొత్తం ఐదు టీ20ఐ మ్యాచ్‌లకు వేదిక కానుంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో యంగ్ ఇండియా టీమ్ బరిలో దిగుతోంది. అయితే ప్రస్తుతం జింబాబ్వే అంత ప్రమాదకరంగా కనిపించడం లేదు. భారత్ సులువుగానే సిరీస్ ఛేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
కానీ గతంలో జింబాబ్వే చాలా సంచలన విజయాలు సాధించింది. పెద్ద టీమ్‌లకు సైతం గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పటి వరకు జింబాబ్వే- భారత్ మధ్య 8 టీ20లు జరిగితే, 6 మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. 2 జింబాబ్వే గెలిచింది. ఇప్పటి వరకు జింబాబ్వే- భారత్ టీ20 సిరీస్‌ల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
- 2022 టీ20 ప్రపంచ కప్
టీ20 ప్రపంచ కప్ 2022లో జింబాబ్వేపై భారత్ 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ మొదట 186/5 స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 61 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే 115 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ (3/22) అద్భత గణాంకాలు నమోదు చేశాడు.
- 2010లో సులువుగా గెలిచిన భారత్
2010లో సురేశ్ రైనా కెప్టెన్సీలో భారత్ జింబాబ్వేలో పర్యటించింది. మొదటి టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది. టీమ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. మొదటి టీ20లో యూసఫ్ పఠాన్ (37*), రెండో మ్యాచ్‌లో సురేశ్ రైనా (72*) రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కెప్టెన్ అందుకున్నాడు. జింబాబ్వేపై భారత్ ఈజీగానే గెలిచింది.
𝐖𝐞 𝐰𝐞𝐥𝐜𝐨𝐦𝐞 𝐓𝟐𝟎 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐮𝐩 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬 𝐈𝐧𝐝𝐢𝐚 🇮🇳 ! 🤗#ZIMvIND pic.twitter.com/Oiv5ZxgzaS
— Zimbabwe Cricket (@ZimCricketv) July 2, 2024
- 2015లో షాక్ ఇచ్చిన జింబాబ్వే
2015లో అజింక్య రహానే కెప్టెన్సీలో టీమ్ ఇండియా జింబాబ్వే పర్యటన చేపట్టింది. 1-1తో జింబాబ్వే సిరీస్‌ను సమయం చేసింది. తొలి మ్యాచ్‌లో భారత్ 179 టార్గెట్ ఇవ్వగా, జింబాబ్వే 124 పరుగులకే ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్ (3/17) అదరగొట్టాడు. రెండో మ్యాచ్‌లో జింబాబ్వే నిర్దేశించిన 146 పరుగుల టార్గెట్‌ను టీమ్ ఇండియా ఛేదించలేకపోయింది. అప్పటి జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న సికందర్ రాజా ఇప్పుడు జింబాబ్వే కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు.
- 2016లో కష్టపడిన ఇండియా
2016లో ధోనీ కెప్టెన్సీలో భారత్ జింబాబ్వే వెళ్లింది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. మొదటి మ్యాచ్‌లో జింబాబ్వే నిర్దేశించిన 170 పరుగులకు భారత్ 2 పరుగుల దూరంలో నిలిచిపోయింది. రెండో టీ20లో బరిందర్ శ్రాన్ (4/10) చెలరేగడంతో జింబాబ్వే 99/9కే పరిమితమైంది. ఒక్క వికెట్ కోల్పోకుండా భారత్ 13.1 ఓవర్లలో టార్గెట్ అందుకుంది. మూడో టీ20లో జింబాబ్వే గట్టి పోటీ ఇచ్చింది. భారత్ నిర్దేశించిన 139 పరుగుల టార్గెట్‌ని ఛేదించేలా కనిపించింది. చివరికి 135 పరుగులకు పరిమితం అయింది. భారత్ కాస్త కష్టపడి సిరీస్ గెలిచింది.
పాకిస్థాన్ క్రికెటర్లకు యోయో టెస్ట్! - PCB YOYO Test
ఇండో పాక్ మ్యాచ్‌కు పీసీబీ ప్లాన్ - ఆ రెండు నగరాలు ఫిక్స్! - ICC Championship Trophy 2025