Teamindia Batter Virat kohli : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. పరుగుల వరద పారిస్తూ సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఇప్పటికీ తన ఆటను కొనసాగిస్తూ కెరీర్లో ముందుకెళ్తున్నాడు. అందుకే ఫ్యాన్స్ అతడిని ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకుంటారు.
అయితే వరల్డ్‌వైడ్‌గా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న విరాట్ గురించి తాజాగా ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అదేంటంటే విరాట్ గ్రహాంతరవాసుల్ని నమ్ముతాడట. వాటి గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాడట. ఈ విషయాన్ని భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ తెలిపాడు.
"నాకు గ్రహాంతర వాసులంటే నమ్మకం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ విషయం గురించి అవగాహన కూడా లేదు. అయితే ఏలియన్స్ గురించి అసలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. దీని గురించి ఎవరో చెబితే విని ఆశ్చర్యపోతుంటారు. అతనెవరో కాదు విరాట్ కోహ్లీ. అమెరికాలోని ఒక ప్రాంతంలో కనిపించిన గ్రహాంతరవాసుల గురించి విరాట్ నాకు ఓ యూట్యూబ్ వీడియోను చూపించాడు. ఆ ప్రాంతం పేరు మర్చిపోయాను. అయితే నేను ఏలియన్స్ గురించి అంతగా పట్టించుకోను కానీ విరాట్‌కు ఈ విషయంపై ఎంతో ఆసక్తి ఉందని నాకు తెలుసు" అని దినేశ్ కార్తిక్ చెప్పుకొచ్చాడు.
ఇకపోతే విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తిక్ చాలా కాలం ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కలిసి ఆడారు. వీరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. 2024 ఐపీఎల్ సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఆర్సీబీ ఓడిపోయింది. ఆ సీజన్ నుంచి నిష్క్రమించింది. అయితే ఆ మ్యాచ్ పూర్తవ్వగానే కార్తిక్ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ 2025 నుంచి ఆర్సీబీకే బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.
కోహ్లీ విషయానికొస్తే రీసెంట్గా అతడు టీ20 ప్రపంచకప్ 2024 విజయం సాాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. అనంతరం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. త్వరలోనే ప్రారంభం కానున్న లంక సిరీస్(వన్డే) కోసం సన్నద్ధం అవుతున్నాడు.
'మునుపటికి ఇప్పటికీ తేడా ఉంది - అతడు చాలా పరిణితి చెందాడు' - Virat Kohli Amit Mishra Issue
గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్ కన్ఫార్మ్- కొత్తగా ముగ్గురికి ప్లేస్! - Gambhir Support Staff