Team Indian Stars First Coaches: ఏ ఆటగాడి జీవితంలోనైనా తొలి కోచ్ పాత్ర చాలా కీలకం. రాయిని శిల్పంగా మార్చి అతడి కెరీర్‌ను నిర్మించడంలో తొలి కోచ్ చాలా కీలకపాత్ర పోషిస్తాడు. ఎంత విజయవంతమైన ఆటగాడైనా చాలా చిన్న వయస్సులోనే ఆట నేర్చుకోవడం ప్రారంభిస్తాడు. వారిలోని ఈ ప్రతిభను గుర్తించి దానిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కోచ్ విధి. అందుకే క్రీడాకారుడికి తొలి కోచ్‌తో భావోద్వేగ సంబంధం ఉంటుంది. ఈ క్రమంలో పలువురు టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ల చిన్ననాటి కోచ్‌ల గురించి, వాళ్ల కెరీర్‌లో ఆ కోచ్‌ల పాత్ర గురించి తెలుసుకుందాం.
కే ఎల్ రాహుల్: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కే ఎల్ రాహుల్ మొదటి కోచ్ శామ్యూల్ జయరాజ్. రాహుల్ కర్ణాటకలోని మంగళూరుకు చెందినవాడు. తాను 11 సంవత్సరాల వయస్సులో మొదటి కోచ్ శామ్యూల్ జయరాజ్ దగ్గరికి వెళ్లానని మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రాక్టీస్ ఉంటే, తాను మాత్రం 2.30 గంటలకే నెట్స్‌కు వెళ్లేవాడని రాహుల్ స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. కోచ్ జయరాజ్ రాహుల్‌ను మంచి స్ట్రోక్ ప్లేయర్‌గా తీర్చిదిద్దారు. ప్రతీ బంతికి సింగిల్ తీసేలా రాహుల్‌ను జయరాజ్ తయారు చేశారు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లోనూ నేటికీ రాహుల్ ఆ నైపుణ్యాన్ని ఉపయోగిస్తున్నారు. ఫలితంగా రాహుల్ ఐపీఎల్లో రూ. 17 కోట్లు ఫీజు రూపంలో అందుకుంటున్నాడు.
సూర్యకుమార్ యాదవ్: మిస్టర్ 360 డిగ్రీ సూర్య తొలి కోచ్ అశోక్ అస్వాల్కర్. అశోక్ అస్వాల్కర్ చెంబూర్‌లో సూర్యకు శిక్షణ ఇచ్చారు. సూర్య అంతర్జాతీయ స్థాయిలో ఎదిగినా అస్వాల్కర్ ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు ఇష్టపడరు. కేవలం టీవీలోనే మ్యాచ్ చూస్తారు. సూర్య మైదానంలో తప్పులు చేస్తే, కోచ్ అస్వాల్కర్ ఆ తప్పిదాన్ని ఎత్తిచూపుతూ అతడికి మెసేజ్‌లు చేస్తారంట. టీమ్ఇండియాలో స్థానం దక్కక నిరాశలో ఉన్న సందర్భాల్లో అస్వాల్కర్ అతడికి అండగా నిలిచాడట. ఇంకా కష్టపడమని ప్రేరేపించాడు. కట్‌చేస్తే సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
-
For you, 𝙒𝙖𝙣𝙠𝙝𝙚𝙙𝙚💙 pic.twitter.com/KKdZpvCogG
— Surya Kumar Yadav (@surya_14kumar) May 6, 2024
అమిత్ మిశ్రా: టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్ అమిత్ మిశ్రా మొదటి కోచ్ సంజయ్ భరద్వాజ్. ఈయన మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్‌కు కూడా శిక్షణ ఇచ్చారు. సంజయ్ భరద్వాజ్ దిల్లీ భరత్‌నగర్‌లో క్రికెట్ అకాడమీని నడుపుతున్నారు. భరద్వాజ్ మార్గదర్శకత్వంలో నితీష్ రాణా, జోగిందర్ శర్మ, ఉన్ముక్త్ చంద్ వంటి అగ్రశ్రేణి క్రికెటర్లు తయారయ్యారు. భరద్వాజ్ బీసీసీఐ స్థాయిలో కోచ్‌గా ఉండాల్సిన వ్యక్తి అని అమిత్ మిశ్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఐపీఎల్ ప్రాంచైజీల్లో చేరి కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా అకాడమీలోని విద్యార్థులను తీర్చిదిద్దేందుకే సంజయ్ భరద్వాజ్ మొగ్గు చూపారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో అమిత్ మిశ్రా ఒకడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న మిశ్రా 161 మ్యాచుల్లో 173 వికెట్లు పడగొట్టాడు.
ఆకాష్ మధ్వల్: ముంబయి ఇండియన్స్ బౌలర్ ఆకాశ్ మధ్వాల్ చిన్ననాటి కోచ్ అవతార్ సింగ్. అతడి సక్సెస్‌లో చిన్ననాటి కోచ్ అవతార్ సింగ్ పాత్ర ఎంతో కీలకం. గత ఐపీఎల్లో ముంబయి స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఆకాశ్ జట్టుకు కీలకంగా మారాడు. 2023 సీజన్లో ముంబయి ప్లేఆఫ్స్ చేరడంలో ఆకాశ్ది కూడా కీలక పాత్ర.
'రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదు - కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీ అలా ఉంటుంది' - కేఎల్ రాహుల్ - IPL 2024