Virat Kohli Fitness Mantra: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక రన్ మెషీన్ మాత్రమే కాదు ఫిట్నెస్ ఫ్రీక్ అని కూడా మనకి తెలుసు. అయితే నిలకడగా ఒకే రకంగా ఫిట్నెస్ మెయిన్టేన్ చేయడం సులువైన పని మాత్రం కాదు. అథ్లెట్లు తమతమ క్రీడల్లో రాణించడానికి చాలా కఠినమైన జీవనశైలికి కట్టుబడి ఉంటారు. అందులో విరాట్ కోహ్లీ కూడా ఒకడు. తన ఎదుగుదలలో తీసుకునే ఆహారం ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పే కోహ్లీ పాటించే నియమాలేంటి? అసలు ఈ స్టార్ క్రికెటర్ ఏం తింటాడు? ఏం తినడో ఒకసారి చూదాం!
సరైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే శరీరం అదుపులో ఉంటుందని విరాట్ పలు సందర్భాల్లో చెప్పాడు. జిమ్ వర్కౌట్స్‌కు కూడా మనం తీసుకొనే ఆహారం ఎంతో తోడ్పడుతుంది అంటాడు. నిజానికి మనం అందరం నోటికి రుచిగా ఉన్నావే తినాలనుకుంటాము. అలా కాకుండా రుచిలేని ఒకేరకమైన ఆహారాలను తినడం చాలా కష్టమైన పని. కానీ, కోహ్లీకి మాత్రం అలా ఉండదట. ఎంతగా అంటే ఒకే ఆహారాన్ని ఆరు నెలలపాటు, రోజుకు మూడుసార్లు తినమన్నా తింటానని, ఆ విషయంలో తనకు ఏ సమస్యా ఉండదని చెబుతాడు.
శాఖాహారిగా ఎలా మారాడంటే!
2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీ తీవ్రమైన అసిడిటీ, యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అప్పుడు చేసిన పరీక్షలలో అతడి ఎముకలలో కాల్షియం కూడా తక్కువగా ఉన్నట్టు తెలిసింది. అప్పుడే తాను పూర్తి వెజిటేరియన్‌గా మారాలని విరాట్ నిర్ణయించుకున్నాడట.
కోహ్లీ డైట్‌లో ఏమి ఉంటుంది?
విరాట్ కోహ్లీ ఎక్కువగా ఉడకబెట్టిన ఆహారాలను మాత్రమే తింటాడు. కూరగాయలు, కీన్వా, పాలకూర ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు. ఉడికించిన కూరగాయలపై రుచి కోసం కాస్త మిరియాలు, ఉప్పు, నిమ్మరసం మాత్రమే ఉపయోగిస్తాడు. వేయించిన ఆహారాలకు కోహ్లీ దూరంగా ఉంటాడు. అప్పుడప్పుడు రాజ్మా, పప్పు, దోసలు కూడా తింటాడు కానీ చాలా మితంగానే. కోహ్లీ బ్రేక్‌ఫాస్ట్‌గా గ్లూటెన్- ఫ్రీ బ్రెడ్‌లో పీనట్ బటర్‌ను తీసుకుంటాడు. రోజంతా, అతడు నిమ్మకాయ స్ప్లాష్‌తో 3- 4 కప్పుల గ్రీన్ టీ తాగుతాడు.
ఇక లంచ్ విషయానికి వస్తే, వెజిటబుల్ సూప్, ఉడికించిన కూరగాయలు , బీట్ రూట్ పాలకూర తప్పనిసరిగా ఉండాల్సిందే. డిన్నర్ కూడా కోహ్లీ ఇదే ఫాలో అవుతాడు. కార్బోహైడ్రేట్ల కోసం విరాట్ మొలకలు, సలాడ్లు తీసుకుంటాడు. వేయించిన ఆహారాలను, కూరలను విరాట్ అస్సలు ముట్టుకొడట. అలాగే మసాలాలకు కూడా కోహ్లీ మెనూలో చోటు లేదు.
విరాట్ అరుదైన ఘనత- టాప్ 2 అథ్లెట్‌గా కోహ్లీ
అమెరికాలో క్రికెట్ ఆడతామని ఊహించలేదు : విరాట్ కోహ్లీ - T20 World Cup 2024