Dinesh Karthik Retirement: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పిన డీకే, తాజాగా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని శనివారం ట్విట్టర్లో వెల్లడించాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన డీకే 20ఏళ్ల పాటు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో డీకే తన కెరీర్లో 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
'కొన్ని రోజులుగా నాకు మద్దతుగా నిలిచి, నాపై ఆప్యాయత చూపిన ఫ్యాన్స్ అందరికి కృతజ్ఞతలు. ఇక నా కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలని డిసైడ్ అయ్యాను. నా సుదీర్ఘ ప్రయాణంలో నాకు మద్దతుగా ఉన్న కెప్టెన్లు, సెలక్టర్లు, సహచరులు, సహాయక సిబ్బంది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దేశంలో మిలియన్ల కొద్ది క్రీడాకారులు ఉన్నప్పటికీ నాకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా తల్లిదండ్రులు ఇన్నేళ్లుగా కెరీర్లో నాకు పిల్లర్లుగా సపోర్ట్‌గా నిలిచారు. వారి ఆశీర్వాదాలు లేనిదే నేను లేను. నా భార్య దీపికకు నేను ఎంతో రుణపడి ఉంటాను. చివరగా నన్ను అభిమానించే అందరికీ థాంక్యూ' అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు.
ఇక అంతర్జాతీయ క్రికెట్లో టెస్టుల్లో 1025, వన్డేల్లో 1752, టీ20ల్లో 686 పరుగులు చేశాడు. మొత్తంగా దినేశ్ ఒక సెంచరీ (టెస్టుల్లో) 17 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక 2018లో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడిన డీకే, వన్డేల్లో 2019, టీ20ల్లో 2022లో చివరిసారిగా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు.
కాగా, ఐపీఎల్లో 257 మ్యాచ్‌లు ఆడిన దినేశ్ తనదైన మార్క్‌ను చూపించాడు. ఐపీఎల్లో దినేశ్ ముంబయి, కోల్‌కతా, ఆర్సీబీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో 4842 పరుగులు నమోదు చేశాడు. అందులో 22 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్లో రాజస్థాన్‌తో ఆడిన మ్యాచ్ దినేశ్‌కు చివరిది. రాబోయే రోజుల్లో డీకేను కామెంటేటర్‌గా చూసే ఛాన్స్ ఉంది.
IPLకు దినేశ్ గుడ్‌బై- రిటైర్మెంట్ ప్రకటించిన Dk
DK సక్సెస్‌లో 'ఆమె'- దినేశ్, దీపిక బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ - Dinesh Karthik Love Story