ETV Bharat / sports

క్రికెట్​కు వృద్ధిమాన్‌ సాహా గుడ్​ బై- ఇకపై IPLకూడా ఆడడంట!

వృద్ధిమాన్‌ సాహా సంచలన నిర్ణయం- క్రికెట్​కు గుడ్​ బై- ఐపీఎల్​ కూడా ఆడనని స్పష్టం!

Saha Retirement
Saha Retirement (Source: Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 4, 2024, 9:45 AM IST

Wriddhiman Saha Retirement : టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్, 40ఏళ్ల వృద్ధిమాన్‌ సాహా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఆదివారం రాత్రి సోషల్ మీడియాలో వెల్లడించాడు. ప్రస్తుతం ఆడుతున్న రంజీనే తన కెరీర్​లో ఆఖరిదని, ఇకపై ఐపీఎల్ బరిలోనూ దిగనని వెల్లడించాడు.

'ప్రతిష్ఠాత్మకమైన క్రికెట్ జర్నీలో ఇదే నా చివరి రంజీ ట్రోఫీ. ఈ రంజీల్లో బంగాల్​కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. రిటైర్​ అయ్యే ముందు కేవలం రంజీలోనే ఆడుతాను. ఈ సీజన్‌ గుర్తుండిపోయేలా చేసుకుంటా' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే రంజీ ట్రోఫీలో వృద్ధిమాన్ తన సొంత రాష్ట్రమైన బంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇక సుదీర్ఘ ఫార్మాట్​కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టెస్టుల్లో సాహానే వికెట్​ కీపింగ్​కు తొలి ఛాయిస్​గా ఉన్నాడు. అతడి కీపింగ్ స్కిల్స్​తో ఆకట్టుకున్నాడు. అయితే రానురాను ఫామ్​తో ఇబ్బందులు పడడం వల్ల సాహా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్​ జట్టులోకి రావడం వల్ల సాహాకు టీమ్ఇండియాలో చోటు దక్కడం కష్టమైంది. 2021లో సాహా న్యూజిలాండ్​పై తన చివరి అంతర్జాతీయ మ్యాచ్​ ఆడాడు.

Wriddhiman Saha Career : కాగా, వృద్ధిమాన్ సాహా 2010లో అంతర్జాతీయ కెరీర్​ ప్రారంభించాడు. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్​తో అరంగేట్రం చేశాడు. సాహా తన కెరీర్​లో 40 టెస్టుల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 29 సగటుతో 1353 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు ఉన్నాయి.

ఇక ఐపీఎల్​లో సాహాకు మంచి రికార్డే ఉంది. సుదీర్ఘ కాలంపాటు ఐపీఎల్ టోర్నమెంట్​​లో పాల్గొన్న సాహా కెరీర్​లో పలు జట్ల ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు 170 మ్యాచ్​లు ఆడిన సాహా 127.57 స్ట్రైక్ రేట్​తో 2934 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతేడాది 2024 సీజన్​లో సాహా గుజరాత్ టైటాన్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

క్రికెట్​కు నలుగురు స్టార్​ ప్లేయర్లు గుడ్​బై!.. WTC ఫైనల్​ అయిన వెంటనే!!

GT vs SRH : శతక్కొట్టిన గిల్.. గుజరాత్‌ ప్లేఆఫ్స్‌కు.. సన్‌రైజర్స్‌ ఇంటికి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.