Team India New Coach : టీమ్ఇండియాకు కొత్త కోచ్ రానున్న సమయం ఆసన్నమైంది. ఇప్పటి కోచ్‌గా బాధ్యతలు చేపడుతున్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. దీంతో కొత్త కోచ్‌గా ఎవరొస్తారన్న విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఇందులో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఎంపిక దాదాపు ఖరారైనట్లే అంటూ పలు కథనాలు సైతం హల్చల్ చేస్తున్నాయి.
"భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉండటానికి మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌తో చర్చలు జరిపాం. ఆయన టీ20 ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేస్తారు" అంటూ బీసీసీఐ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉండగా, కోచ్‌గా బాధత్యలు అంగీకరించడానికి బీసీసీఐ ముందు గంభీర్ ఓ డిమాండ్ ఉంచినట్లు తెలుస్తోంది. సపోర్టింగ్ స్టాఫ్‌ను నియమించే విషయంలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటూ గంభీర్ వాళ్లను అడిగారట. ఇక ఈ విషయానికి బోర్డు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.
చూస్తుంటే ఈ మాట వల్ల ప్రస్తుతం ఉన్న సహాయక సిబ్బంది మొత్తం తప్పుకోవాల్సి ఉంటుంది.ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్‌గా పరాస్ మంబ్రే, ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్‌లు కీలకంగా ఉన్నారు.
మరోవైపు గంభీర్ సహాయక సిబ్బందిలోనే కాకుండా జట్టులోనూ మార్పులు చేస్తారని సమాచారం. "భారత జట్టుకు కోచ్‌గా ఉండాలని నేను అనుకుంటున్నాను. నేషనల్ టీమ్‌కు కోచింగ్ ఇవ్వటం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదని నా అభిప్రాయం. 140 మంది కోట్ల భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు లెక్క" అని గంభీర్ ఇటీవల ఓ ప్రోగ్రాంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే మరి కొందరి కథనాల ప్రకారం ఇప్పటికే గంభీర్ నియామకం పూర్తయిందని, ఈ నెల(జూన్) చివరిలో బీసీసీఐ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని టాక్ నడుస్తోంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే గంభీర్ నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడునందట.
లాస్ట్ స్టేజ్‌లో గ్రూప్ మ్యాచ్‌లు- సూపర్ 8 బెర్త్‌లు ఫిక్స్!
స్కాట్లాండ్పై ఆసీస్ విక్టరీ- ఇంగ్లాండ్ సూపర్ 8కు లైన్ క్లియర్ - T20 World cup 2024