Border Gavaskar Trophy 2024 Gambhir : బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత జట్టు ఆదివారం ఆస్ట్రేలియా బయల్దేరింది. ఆసీస్ గడ్డపై కంగారూలతో భారత్ ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్ 22న తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సోమవారం ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఇందులో పలు ప్రశ్నలకు గంభీర్ బదులిచ్చాడు.
తొలి టెస్టులో రోహిత్ ఆడతాడా?
ఈ సిరీస్‌లో తొలి టెస్టులో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే తొలి టెస్టు నవంబర్ 22న నాటికి రోహిత్ గురించి తెలుస్తుంది. ఒకవేళ అందుబాటులో లేకపోతే మాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇక అభిమన్యూ ఈశ్వరన్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించే ఛాన్స్ ఉంది. రాహుల్ ఓపెనింగ్ చేయగలడు, నెం 3, నెం 6 ఏ స్థానంలోనైనా ఆడగలడు. అలా ఏ పొజిషన్లోనైనా బ్యాటింగ్ చేయడానకిి ఎంతో టాలెంట్ ఉండాలి. అతడు వన్డేల్లో కీపింగ్ కూడా చేయగలడు. అలాంటి ప్లేయర్ అన్ని జట్లలో ఉండడు.
రోహిత్ లేకపోతే
ఒకవేళ రోహిత్ లేకపోతే తొలి టెస్టులో టీమ్ఇండియాకు జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తాడు.
విరాట్, రోహిత్ గురించి
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఎలాంటి అందోళన లేదు. వాళ్లపై నమ్మకం ఉంది.
సోషల్ మీడియా ట్రోల్స్
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మా ప్రదర్శన బాగాలేదు. ఆ సిరీస్ ఓటమితో సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. నేనేమీ వాటిని సమర్థించుకోవడం లేదు. కానీ, టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. వారితో కలిసి పనిచేయడం కోచింగ్ సిబ్బంది గౌరవంగా భావిస్తున్నారు.
WTCఫైనల్
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ గురించి మేం ఇప్పుడు ఆలోచించడం లేదు. ఇప్పటివరకు జరిగిన ప్రతి మ్యాచ్, సిరీస్ మాకు కీలకం. నాణ్యమైన క్రికెట్ ఆడేందుకే ప్రయత్నించాం. ఇకపై కూడా అలాగే ప్రయత్నిస్తూనే ఉంటాం. జట్టులో చాలా మంది కుర్రాళ్లు ఉన్నారు. హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి కీలకపాత్ర పోషిస్తారని అనుకుంటున్నా. ఆసీస్ పిచ్‌లు పేస్‌కు అనుకూలం అని తెలుసు.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి భారత్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.. రిజర్వ్: ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైని, ఖలీల్ అహ్మద్
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) October 25, 2024
Squads for India’s tour of South Africa & Border-Gavaskar Trophy announced 🔽#TeamIndia | #SAvIND | #AUSvIND pic.twitter.com/Z4eTXlH3u0
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ: జట్టు ప్రకటించిన ఆస్ట్రేలియా- టీమ్‌లోకి కొత్త కుర్రాడు
'టీమ్ఇండియాలో పూజారాకు ఇంకా ప్లేస్ ఉంది- జట్టుకు అతడు అవసరం!'