Sanjay Manjrekar T20 World Cup Team: 2024 టీ 20 ప్రపంచకప్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పొట్టి ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించేందుకు ఇంకో నాలుగు రోజుల సమయమే మాత్రమే ఉంది. ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేసేందుకు మే 1 చివరి తేదీ కావడం వల్ల అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టు ఎంపిక కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ నెలాఖరులోపు జట్టును ప్రకటించాల్సి ఉండడం వల్ల అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇప్పటికే చర్చల ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తన టీ 20 ప్రపంచకప్ జట్టును ప్రకటించాడు. బీసీసీఐ ప్రకటించే జట్టు ఎలా ఉండబోతుందో మంజ్రేకర్ అంచనా వేశాడు. ఈ క్రమంలో 15మందితో కూడిన జట్టును మంజ్రేకర్ ప్రెడిక్ట్ చేశాడు. ఈ జట్టులో టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీని ఎంచుకోకపోవడం చర్చనీయాంశమైంది.
మంజ్రేకర్ జట్టు ఇలా
2007లో టీ 20 ప్రపంచకప్ గెలుచుకున్న టీమ్ఇండియా మరోసారి ఆ టైటిల్‌ను ఒడిసి పట్టాలని పట్టుదలగా ఉంది. ఈ ఐపీఎల్‌లో ముంబయిపై సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చిన యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించాలని మంజ్రేకర్ ప్రతిపాదించాడు. మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ , KL రాహుల్, రవీంద్ర జడేజా ఉండాలని సూచించాడు.
అటు స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌ను జట్టులోకి తీసుకున్న మంజ్రేకర్ పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్‌కు చోటు కల్పించారు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా కృనాల్ పాండ్య పేసర్‌గా హర్షిత్ రాణాను కూడా ఎంచుకున్నాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై మంజ్రేకర్ ప్రశంసల జల్లు కురిపించాడు. కుల్‌దీప్ ప్రస్తుతం కెరీర్‌లోనే మంచి ఫామ్‌లో ఉన్నాడని తెలిపాడు.
ఫ్యాన్స్ ఫైర్: అయితే ఈ జట్టులో విరాట్‌ను ఎంపిక చేసుకోకపోవడం వల్ల కోహ్లీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు! సోషల్ మీడియాలో అతడిపై ఫైరవుతున్నారు. 'విరాట్ లేనిదే వరల్డ్‌కప్ టీమ్ ఎంపిక ఏంటి'?, మీ ఒపీనియన్‌కు థాంక్యు, మీరేమైనా సెలెక్టరా? అసలు టీమ్ ఇదికాదులే!' అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఆ స్టార్‌కు కూడా నో ఛాన్స్!
ఈ ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమవుతున్న ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు కూడా మంజ్రేకర్ మంజ్రేకర్ తన జట్టులో స్థానం ఇవ్వలేదు. మీ ఒపీనియన్‌కు థాంక్యు, మీరేమైనా సెలెక్టరా? అసలు టీమ్ ఇదికాదులే!' అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
టీ 20 ప్రపంచకప్ కోసం మంజ్రేకర్ జట్టు: రోహిత్ శర్మ ( కెప్టెన్), యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, KL రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్‌ఖాన్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, కృనాల్ పాండ్య.
'రెండో గెలుపునకు 30 రోజులు, మూడోది ఎప్పుడో?'- ఆర్సీబీ విజయంపై ఫన్నీ మీమ్స్ - IPL 2024