Irfan Pathan On Pandya Dube: టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా టీమ్‌ఇండియా బరిలోకి దిగుతోంది. జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో ఇండియా వరల్డ్‌కప్ వేట మొదలు కానుంది. ఈ క్రమంలో భారత్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. దీనిపై క్రికెట్ ఎక్స్‌పర్ట్స్, టీమ్ ఇండియా మాజీ ప్లేయర్స్ తమ విశ్లేషణలు వినిపిస్తున్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ ప్రెస్ రూమ్‌లో ఇర్ఫాన్ పఠాన్, పేస్ ఆల్ రౌండర్స్‌కి సంబంధించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. వాస్తవానికి 15 మంది సభ్యులతో టీమ్ ఇండియా స్క్వాడ్‌ని ప్రకటించినప్పుడు, ఇద్దరు పేస్ ఆల్ రౌండర్లు ఎందుకని ప్రశ్నించారు. కొందరు హార్దిక్ పాండ్యకి బ్యాకప్‌గా శివమ్ దూబేని ఎంపిక చేసినట్లు భావించారు. అయితే భారత్ జట్టు ప్లేయింగ్ 11లో ఈ ఆల్ ఆల్ రౌండర్స్ పాత్ర ఎలా ఉండాలో? ఇర్ఫాన్ పఠాన్ వివరించాడు.
హార్దిక్, దూబే పాత్రలు వేరు
'హార్దిక్ పాండ్య, శివమ్ దూబే డిఫరెంట్ రోల్స్ పోషిస్తారని నేను భావిస్తున్నాను. గేమ్‌ను ముగించే బాధ్యత హార్దిక్‌కు ఉంటుంది. శివమ్ దూబే ఫ్లోటర్‌గా ఆడతాడు. కనీసం ప్లేఆఫ్స్‌లో స్పిన్నర్లపై ఎదురు దాడి చేసేందుకు బరిలోకి దిగుతాడు' అని చెప్పాడు. భారత్‌కు ఫినిషర్‌గా మరింత ప్రభావవంతంగా ఉండాలంటే హార్దిక్ పాండ్య తన వైడర్ స్టాన్స్‌కి తిరిగి వచ్చేందుకు కృషి చేయాల్సి ఉందని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. హార్దిక్‌ని బ్యాటింగ్ పొజిషన్‌లో ముందుకు తీసుకెళ్లడం వల్ల, అతను తన స్టాన్స్ మార్చుకున్నాడని, దీంతో అతని పేస్ హిట్టింగ్‌పై ప్రభావం పడిందని వివరించాడు.
హార్దిక్ పాండ్య బౌలింగ్
భారత్ టీ20 ప్రపంచ కప్ జట్టులో హార్దిక్ పాండ్యా ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో పాటు మూడో సీమర్‌గా ఆడవచ్చు. అది జరగాలంటే, ఐపీఎల్ 2024 సీజన్ చివరిలో హార్దిక్ బౌలింగ్‌లో చూపిన ఫామ్‌ని రిపీట్ చేయాలని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. 'హార్దిక్ బౌలింగ్ చేస్తుంటే, అతడు ఐపీఎల్ చివరిలో ఉన్న ఫామ్‌ని కంటిన్యూ చేయాలి. ఇది అతడి బ్యాటింగ్‌కు కూడా సహాయపడుతుంది. ఎందుకంటే అతను ప్రధానంగా భారత జట్టులో బౌలింగ్ కాకుండా బ్యాటింగ్ ఆల్ రౌండర్‌గా ఆడతాడు. అయితే, ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది. మీరు ఒక ప్రాంతంలో బాగా రాణిస్తే, అది మీ విశ్వాసాన్ని పెంచుతుంది' అని తెలిపాడు.
ఇండియన్ ప్రీమియ్ లీగ్ 2024లో ముంబయి ఇండియన్స్ తరఫున హార్దిక్ 10.75 ఎకానమీ రేటుతో 11 వికెట్లు తీశాడు. అయితే భారత్ తన ఐసీసీ కలను నెరవేర్చుకోవాలంటే, 11 ఏళ్ల నిరీక్షణను తెరపడాలంటే, హార్దిక్ అంతకంటే మెరుగ్గా రాణించాలి.
'గంభీర్ సరైనోడే, వాళ్లను డీల్ చేయడం అతడికి తెలుసు' - India Head Coach
2024 వరల్డ్‌కప్: విరాట్, గేల్ రికార్డులు బద్దలయ్యే ఛాన్స్! - T20 World Cup 2024