ETV Bharat / sports

విరాట్​పై ఆందోళనా? కోహ్లీ స్ట్రైక్​రేట్​పై రోహిత్, అగార్కర్ రియాక్షన్ ఇదే! - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

Virat Strike Rate IPL: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్​పై ఎలాంటి ఆందోళన లేదని చీఫ్ సెలక్టర్ అగార్కర్ అన్నాడు. అతడు ప్రస్తుతం ఐపీఎల్ బాగా ఆడుతున్నాడని స్ట్రైక్​రేట్​ గురించి ఆలోచించాల్సిన పని లేదని అభిప్రాయపడ్డాడు.

Agarkar About Virat Strike Rate
Agarkar About Virat Strike Rate (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 8:29 PM IST

Virat Strike Rate IPL: 2024 ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి స్ట్రైక్‌ రేట్ చర్చనీయాంశమైంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నా, స్ట్రైక్‌ రేట్​పై ఆందోళనలు తలెత్తాయి. ఓ దశలో ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌కి కోహ్లిని ఎంపిక చేయడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు బీసీసీఐ ఇటీవల టీమ్‌ ఇండియా స్క్వాడ్‌ని అనౌన్స్‌ చేసి చర్చలకు ముగింపు పలికింది. గురువారం చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్‌, కెప్టెన్‌ రోహిత్‌ నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా ఈ విషయంపై మరింత స్పష్టత ఇచ్చారు.

వరల్డ్‌ కప్‌లో విరాట్ అనుభవం అవసరం: జూన్ 1న ప్రారంభం కానున్న మెగా టోర్నమెంట్‌లో టీమ్‌ఇండియాకు కోహ్లీ అనుభవం అవసరమని, కోహ్లీ స్ట్రైక్ రేట్ ఎప్పటికీ సమస్య కాదని అజిత్ అగార్కర్ చెప్పాడు. 'ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే సెలక్షన్ కమిటీ కోహ్లీ స్ట్రైక్ రేట్‌ గురించి చర్చించలేదు. జట్టులో సరైన బ్యాలెన్స్‌ ఉండాల్సిన అవసరం ఉంది. 35 ఏళ్ల విరాట్ మిడిల్‌లో​ ఆ బ్యాలెన్స్‌ని తీసుకొస్తాడని నమ్ముతున్నాం. ఐపీఎల్‌ నుంచి పాజిటివ్‌ అంశాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్రపంచకప్‌లో ఒత్తిడి వేరుగా ఉంటుంది' అని అన్నాడు.

విరాట్‌ స్ట్రైక్‌ రేట్ గురించి నో టెన్షన్‌? కెప్టెన్​ రోహిత్​కు కూడా విరాట్‌ స్ట్రైక్‌ రేట్​ గురించి ప్రశ్న ఎదురైంది. ప్రెస్​మీట్​లో విరాట్ స్ట్రైక్‌ రేట్​ గురించి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు రోహిత్ ఓ నవ్వు నవ్వుతూ సింపుల్​గా రియాక్ట్​ అయ్యాడు. 'విరాట్ స్ట్రైక్‌ రేట్​ గురించి టెన్షన్‌ అవసరం లేదు' అన్నట్లు రోహిత్ ఓ లుక్‌ ఇచ్చాడు.

ఐపీఎల్‌లో స్ట్రైక్‌ రేట్ ఎంత?: ప్రస్తుతం విరాట్ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు. 10 మ్యాచ్‌లలో, 71.43 యావరేజ్‌తో 500 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్‌ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. కోహ్లి స్ట్రైక్ రేట్ 147.49గా ఉంది.

'మంజ్రేకర్ T20 వరల్డ్​కప్​ టీమ్'- మాజీ క్రికెటర్ జట్టులో విరాట్​కు నో ప్లేస్ - 2024 T20 World Cup

ఫీల్డ్​ అంపైర్​తో గొడవ - కోహ్లీకి గట్టి షాకిచ్చిన ఐపీఎల్ బాసులు! - IPL 2024 RCB VS KKR

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.