Rohit Sharma Border Gavaskar Trophy : టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. వ్యక్తిగత కారణాలతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్ధమైయ్యాడు. నవంబర్ 24వ తారీఖు రోహిత్ ఆస్ట్రేలియా చేరుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. హిట్‌మ్యాన్ నేరుగా తొలి టెస్టు మ్యాచ్ వేదిక పెర్త్‌కు చేరుకోనున్నాడు. కాగా, నవంబర్ 22న భారత్- ఆసీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. అంటే ఈ మ్యాచ్ జరుగుతుండగానే రోహిత్ పెర్త్ స్టేడియంలో కనిపించనున్నాడు.
'నవంబర్ 23న రోహిత్ ముంబయి నుంచి బయలుదేరాల్సి ఉంది. అతడు 24వ తేదీన పెర్త్ చేరుకుంటాడు. తర్వాత అడిలైడ్‌లో జరిగే డే- నైట్ (రెండో మ్యాచ్) టెస్టుకు ఎలా ప్రిపేర్ అవ్వాలనే దానిపై కోచింగ్ స్టాఫ్‌తో చర్చిస్తాడు. ఇక కాన్‌బెర్రాలో జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడు' అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. రెండో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 6న ప్రారంభం కానుంది.
కాగా, ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత ఆటగాళ్లు ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లారు. అయితే తన భార్య ప్రవసం కారణంగా కెప్టెన్ రోహిత్ జట్టుతో కలిసి ఆసీస్‌కు వెళ్లలేదు. దీంతో తొలి టెస్టుకు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు మేనేజ్మెంట్ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఇక తాజాగా ఆసీస్ పయనమయ్యేందుకు రోహిత్ రెడీ అవ్వడం వల్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
🚨 CAPTAIN ROHIT IS COMING 🚨
— Johns. (@CricCrazyJohns) November 21, 2024
- Rohit Sharma is likely to join the Indian team on November 24th. [Cricbuzz] pic.twitter.com/xebL1eGKGf
తొలి టెస్టుకు భారత్ తుది జట్టు (అంచనా)
జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా)
పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, నథన్ మెక్స్వేనే, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), నథన్ లియాన్, జోష్ హేజెల్‌వుడ్, మిచెల్ స్టార్క్
'విరాట్‌కు ఆ రెండే కీలకం- ఒక్కసారి అలా చేస్తే ఆసీస్‌కు చుక్కలే'
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ - మనోళ్ల ముందున్న 12 భారీ రికార్డులివే