Rohit Sharma Wimbledon: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 వరల్డ్‌కప్ తర్వాత రీఫ్రెష్ మోడ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే హిట్‌మ్యాన్ రీసెంట్గా లండన్ పయనమయ్యాడు. అక్కడ ఫ్యామిలీతో కాస్త చిల్ అవుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాడు. దీంతో వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మకు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ వింబుల్డన్ తన అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో ఫొటో షేర్ చేసింది.
సూట్ ధరించిన రోహిత్ క్లాసీ లుక్‌తో వింబుల్డన్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. బ్లూ షర్ట్, గ్రే కలక్ సూట్, టై విత్ గాగుల్స్‌తో అచ్చం హాలీవుడ్ హీరోలా ఎంట్రీ ఇచ్చి, విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని లైవ్ మ్యాచ్ ఎంజాయ్ చేశాడు. మ్యాచ్‌కు ముందు రోహిత్ మాట్లాడాడు. 'నాకు టెన్నిస్ అంటే చాలా ఇష్టం. ఈ టోర్నీ జరుగుతుండగా నేను లండన్‌లోనే ఉండడం కలిసొచ్చింది. తొలిసారి నేను వింబుల్డన్‌కు వచ్చాను. ఈ క్రీడా వాతావరణాన్ని స్వయంగా ఎంజాయ్ చేద్దామని వచ్చా' అని అన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. 'హిట్‌మ్యాన్ లుక్స్ అదుర్స్', 'బాలీవుడ్ హీరో', 'కెప్టెన్ స్వాగ్' అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
World Cup winning Captain Rohit Sharma speaks at Wimbledon. 🐐 pic.twitter.com/J2tGyXsyMx
— Johns. (@CricCrazyJohns) July 12, 2024
THE AURA OF 🐐 ROHIT SHARMA AT WIMBLEDON. 🏆pic.twitter.com/xh1GhkQ1H9
— Vishal. (@SPORTYVISHAL) July 12, 2024
THE CRAZE OF CAPTAIN ROHIT SHARMA...!!🐐🇮🇳
— ANKIT SHARMA (@AnkitSharma8878) July 12, 2024
The Face of World Cricket @ImRo45 🔥#Wimbledon pic.twitter.com/k8nfJq9404
ఇక మ్యాచ్ విషయానికొస్తే, శుక్రవారం జరిగిన రెండో సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాస్ (స్పెయిన్)- మెద్వెదెవ్ (రష్యా) తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్‌పై అల్కరాస్ (1-7), 6-3, 6-4, 6-4 తేడాతో నెగ్గి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మరో సెమీస్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్- ముసెట్టి (ఇటలీ)తో తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో జకొవిచ్ 6-4, 7-6 (7-2), 6-4తో విజయం సాధించాడు. ఇక జులై 14న జరగనున్న వింబుల్డన్ ఫైనల్లో జకోవిచ్- అల్కరాస్ తలపడనున్నారు. ఏడుసార్లు ఛాంపియన్ నొవాక్ జకోవిచ్, గతేడాది విజేత కార్లోస్ అల్కరాస్ అదిరే ఆటతో ఫైనల్లోకి దూసుకొచ్చారు. మరి జకోవిచ్ 8వ టైటిల్ నెగ్గుతాడా? అల్కరాస్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదా నిలుపుకుంటాడా? అనేది ఆదివారం తేలిపోనుంది.
రోహిత్‌కు ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ తిరిగి ఇచ్చేస్తారా? - Rohith Sharma Nita Ambani
ప్రేక్షకులపై జకోవిచ్ ఫైర్ - ఇంటర్వ్యూ మధ్యలో నుంచే జంప్! - Novak Djokovic Fire on Audience