Rohit Sharma On World Cup : 2024 టీ20 వరల్డ్‌కప్ టైటిల్ దక్కించుకోవడానికి ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా అమలుచేసిన స్ట్రాటజీని కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. ఈ స్ట్రాటజీలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్మార్ట్‌గా వ్యవహరించాడని రోహిత్ అన్నాడు. తన చాకచక్యంతో సౌతాఫ్రికా బ్యాటర్ల రిథమ్ బ్రేక్ చేశాడని చెప్పాడు.
'ఛేజింగ్‌లో సౌతాఫ్రితాకు 30 బంతుల్లో 30 పరుగులు కావాలి. వాళ్లకు ఇంకా చాలా వికెట్లు ఉన్నాయి. మేమంతా కంగారు పడుతున్నాం. కానీ, కెప్టెన్ కంగారు పడినట్లు కనిపించకూడదు. అప్పుడు గేమ్‌ను స్లో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పటికే ప్రత్యర్థి బ్యాటర్లు ఫామ్‌లో ఉన్నారు. ఆ రిథమ్‌లోనే వాళ్లు మ్యాచ్ కంప్లీట్ చేయాలన్న ఆలోచనలో ఉంటారు. ఎలాగైనా ఆ రిథమ్ బ్రేక్ చేయాలి. అప్పుడే నేను ఫీల్డింగ్ సెట్ చేస్తూ, బౌలర్లతో మాట్లాడుతున్నా. ఆ మూమెంట్లో రిషభ్ తన టాలెంట్‌తో ఆటను కాసేపు నిలిపివేసి, వాళ్ల ఫ్లో దెబ్బతీశాడు. తన మోకాలికి ఏదో అయినట్లు కింద పడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి బ్యాండేజ్ వేస్తున్నాడు. దీంతో గేమ్ స్లో అయ్యింది. ఇక మ్యాచ్ ఎప్పుడు స్టార్ అవుతుందని క్రీజులో ఉన్న క్లాసెన్ వెయిట్ చేస్తున్నాడు. దీనివల్ల మేం గెలిచాం అని అనడం లేదు. కానీ, అక్కడ పంత్ తెలివిగా వ్యవహరించడం కలిసొచ్చింది' అని రోహిత్ తాజాగా పాల్గొన్న ఓ కామెడీ షో లో చెప్పాడు.
Rohit Sharma praising Rishab Pant for the break when they needed 30 on 30 #RohitSharma𓃵 #RishabhPant pic.twitter.com/JwZjihkzUT
— Sarthak Aggarwal 🇮🇳 (@Sarthak130305) October 5, 2024
అయితే అప్పటికే క్రీజులో ఉన్న హెన్రీచ్ క్లాసెన్ (27 బంతుల్లో 52 పరుగులు) ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. అలా ఆటను కాసేపు నిలిపివేయడం వల్ల సౌతాఫ్రికా ఫ్లో దెబ్బతింది. గేమ్ తిరిగి ప్రారంభమైన వెంటనే తొలి బంతికే క్లాసెన్‌ను హార్దిక్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో మార్కో జాన్సన్ పెవిలియన్ చేరడం వల్ల భారత్ తిరిగి పుంజుకుంది. ఇక సౌతాఫ్రికాకు అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టంగా బంతులేసి కట్టడి చేసింది. టీమ్ఇండియా నిర్దేశించిన 177 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 169 పరుగులకు పరిమితమైంది. ఫలితంగా భారత్ 7 పరుగుల తేడాతో నెగ్గి రెండోసారి పొట్టి కప్‌ను ముద్దాడింది.
𝗖.𝗛.𝗔.𝗠.𝗣.𝗜.𝗢.𝗡.𝗦 🏆#TeamIndia 🇮🇳 HAVE DONE IT! 🔝👏
— BCCI (@BCCI) June 29, 2024
ICC Men's T20 World Cup 2024 Champions 😍#T20WorldCup | #SAvIND pic.twitter.com/WfLkzqvs6o
స్టూడెంట్‌కు పంత్ ఆర్థిక సాయం- గంటలోనే మనీ రిటర్న్- ఏమైందంటే? - Rishab Pant
T20ల్లో టీమ్ఇండియా అరుదైన ఘనత- తొలి జట్టుగా రికార్డ్ - Team India 150th Win